పేలవ బౌలింగ్‌తోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలయ్యామని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. అనుభవం కలిగిన బౌలర్లు లేకపోవడంతోనే 221 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని చెప్పుకొచ్చాడు. తమ బ్యాటింగ్ బాగున్నా.. బౌలింగ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ పేలవ బౌలింగ్‌తో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన అజింక్యా రహానే.. ముంబై బ్యాటర్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. తనకు కాళ్ల పిక్కలు పట్టేసాయని, ప్రస్తుతం బాగానే ఉందని చెప్పాడు. కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేస్తేనే తమ టీమ్ కాంబినేషన్ సెట్ అవుతుందన్నాడు.

'ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను. రెండు కాళ్ళ పిక్కలు విపరీతంగా పట్టేసాయి. త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నాను. నిజంగా ఇది చాలా కష్టంగా అనిపించింది. ఈ పిచ్‌పై 220-225 పరుగులు మంచి స్కోరు అని నేను అనుకున్నాను. మేం బ్యాటింగ్ చాలా బాగా చేశాం. కానీ మా బౌలింగ్ విభాగంలో అనుభవం లేకపోవడం మైనస్ అయ్యింది.
ముంబై ఇండియన్స్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుతో ఆడటం మాకు ఒక గుణ పాఠం.
వైభవ్ అరోరా తప్ప, కార్తీక్, ముజరబానీలకు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం లేదు. మా దగ్గర ఇద్దరు అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నప్పటికీ.. ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన ముందు తేలిపోయారు. మా బౌలర్లు ఖచ్చితంగా ఈ మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకుంటారు.
నాకింకా 37 ఏళ్లే.. నేనింకా కుర్రాడినే (నవ్వుతూ). చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ ఈ క్రాంప్స్‌తో (కండరాలు పట్టేయడం) కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ముంబైలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంటుంది. కానీ ప్రస్తుతం నేను బ్యాటింగ్ చేస్తున్న తీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.
కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయడం ప్రారంభిస్తే.. మా జట్టు కాంబినేషన్ సెట్ అవుతుంది. ప్రస్తుతానికి జట్టు సమతుల్యత చూసుకోవాలి. బ్యాటింగ్‌లో మేం అదరగొట్టాం. కానీ బౌలింగ్‌లో ఆ సమతూకం దొరకడం చాలా ముఖ్యం. గ్రీన్ త్వరగా బౌలింగ్ చేయాలని కోరుకుంటున్నా.
గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేయలేకపోతున్నాడు? అన్న ప్రశ్నను క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాలి. బ్యాటింగ్ పరంగా మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఆడిన కార్తీక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.'అని అజింక్యా రహానే చెప్పుకొచ్చాడు.