Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను మ్యాచ్ విన్నర్.. జట్టు అండగా నిలవాలి: అజింక్యా రహానే

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మాజీ క్రికెటర్ అజింక్యా రహానే అండగా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ మ్యాచ్ విన్నర్ అని, అతనికి టీమిండియా మేనేజ్‌మెంట్ అండగా నిలవాలని కోరాడు. శ్రీలంకతో తొలి టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 25 ఓవర్ల వరకు బౌలింగ్ చేసి ఒకే ఒక్క వికెట్ తీసాడు. అంతేకాకుండా 103 పరుగులు సమర్పించుకున్నాడు.

మరోవైపు మానవ్ సుతార్ (4/76, 6/55) పది వికెట్లతో సత్తా చాటగా.. జడేజా(3/57, 1/71) నాలుగు వికెట్లు పడగొట్టాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండో టెస్ట్‌ నుంచి అతన్ని తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

గిల్ కాదు.. శ్రీలంక కండిషన్స్ అతనికి బాగా సూటవుతాయి: అజింక్యా రహానే

గిల్ కాదు.. శ్రీలంక కండిషన్స్ అతనికి బాగా సూటవుతాయి: అజింక్యా రహానే

కుల్దీప్ యాదవ్‌కు అండగా ఉండాలి..

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అజింక్యా రహానే.. కుల్దీప్ యాదవ్‌ను వెనకేసుకొచ్చాడు.ఈ కష్టకాలంలో అతనికి మేనేజ్‌మెంట్ అండగా నిలవాలని సూచించాడు. 'కుల్దీప్ యాదవ్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ అండగా నిలవాలి. అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. క్లిష్ట సమయాల్లో అతను వికెట్లు తీసాడు. తొలి టెస్ట్‌లో అతనికి ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం లభించలేదు. ఆటలో ఇలా జరగడం సాధారణమే.

Ajinkya Rahane Backs Kuldeep Yadav Says He Needs the Team s Support After 1st Test Struggles

కొన్నిసార్లు రిథమ్ లభించదు. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉంటే కుల్దీప్ యాదవ్‌కు అండగా ఉండాలి. అతను మ్యాచ్ విన్నర్. జట్టు ఇప్పుడు అతనికి మద్దతు ఇస్తే.. అతను మంచి ఫలితాలను అందిస్తాడు.

మానవ్ సుతార్ అర్హుడు..

ఈ అవకాశం అందుకోవడానికి మానవ్ సుతార్‌ పూర్తి అర్హుడు. ఎందుకంటే గత టెస్ట్ మ్యాచ్‌లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో చాలా ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశాడు. అతను వేసిన తొలి బంతికే వికెట్ తీయడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఒక బౌలర్‌గా తొలి బంతినే సరైన ప్రదేశంలో వేయడం చాలా ముఖ్యం. అలా వేయడానికి చాలా అనుభవం, నైపుణ్యంపై కొండంత ఆత్మవిశ్వాసం ఉండాలి.

అతను వేసిన ఆ బంతి అసాధారణమైనది. మొదటి, రెండో ఇన్నింగ్స్‌ల్లో అతని బౌలింగ్ వేగంలో కాస్త మార్పులు కనిపించాయి. అతను మరింత మెరుగవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది. అతనికి అదిరిపోయే ఆరంభం లభించింది. అయితే ఈ ప్రదర్శనను ఆస్వాదిస్తూనే మరింత మెరుగయ్యే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం.

వైభవ్‌ సూర్యవంశీని వదిలేయండి.. ఇప్పుడే టెస్ట్ క్రికెట్ ఆడించొద్దు: అజింక్యా రహానే

Also Read

వైభవ్‌ సూర్యవంశీని వదిలేయండి.. ఇప్పుడే టెస్ట్ క్రికెట్ ఆడించొద్దు: అజింక్యా రహానే

పిచ్ కండిషన్స్ బట్టి మార్పులు..

రెండో టెస్ట్‌కు భారత జట్టులో మార్పులు ఉంటాయా? అంటే పిచ్ కండిషన్స్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటాయి. మేం గతంలోఆడినప్పుడు సీమ్‌కు అనుకూలించే వికెట్స్‌ను ఇచ్చారు. కాబట్టి కండిషన్స్ బట్టి బౌలింగ్ కాంబినేషన్‌ను ఎంచుకోవాలి. పిచ్ పొడిగా ఉండకుండా.. కాస్త గడ్డితో ఉండి సీమింగ్ పరిస్థితులు ఉంటే.. తుది జట్టులో ఒక మార్పు ఉంటుంది. లేకపోతే ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతారు. కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలి.'అని రహానే చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, August 20, 2026, 17:10 [IST]
Other articles published on Aug 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+