IND vs SL: మాట పడనప్పుడు.. స్లెడ్జింగ్ చేయవద్దు: జడేజా
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీలంకతో రెండో టెస్ట్‌లో ఆ జట్టు పేసర్ అసితా ఫెర్నాండోతో యశస్వి జైస్వాల్ గొడవపడటాన్ని జడేజా తప్పుబట్టాడు. మాట పడనప్పుడు.. వారిని స్టెడ్జింగ్ చేయకూడదని చురకలంటించాడు.
ఆదివారం కొలంబో వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్, ఫెర్నాండోతో గొడవపడ్డాడు. యశస్వి జైస్వాల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన అసితా ఫెర్నాండో అత్యుత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఓ మాట అనడంతో ఆగ్రహానికి గురైన జైస్వాల్.. అతనిపైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతని హెల్మెట్ ఫెర్నాండోకు తాకింది.
మాట పడనప్పుడు..మీరు అనొద్దు..
ఈ ఘటనపై సోటీ టీవీ షోలో మాట్లాడిన అజయ్ జడేజా.. యశస్వి జైస్వాల్ ప్రవర్తనను తప్పుబట్టాడు. 'క్రీడల్లో ఇది ఏ మాత్రం మంచిది కాదు. అత్యంత ప్రమాదకరం. గత మ్యాచ్‌లోనూ యశస్వి జైస్వాల్ ప్రత్యర్థి జట్టు బ్యాటర్ నిరోషన్ డిక్‌వెల్లా ఆడుతున్నప్పుడు స్లెడ్జింగ్‌తో రెచ్చగొట్టాడు. సరదాగానే మాట్లాడుతూ.. భారీ షాట్ ఆడేలా ఉసిగొల్పాడు.

అభ్యంతరకరమైన మాటలు లేనంతవరకూ ఇలాంటి స్లెడ్జింగ్ మంచిదే. రెండో టెస్ట్‌లోనూ అదే జరిగింది. కానీ, ఇక్కడ ప్రత్యర్థి తనను చూసి నవ్వినప్పుడు తట్టుకోలేకపోతే.. జైస్వాల్ కూడా ఇతరులను చూసి నవ్వకూడదు. ఇతరులు మిమ్మిల్ని అన్నప్పుడు తీసుకోలేకపోతే.. మీరు కూడా ప్రత్యర్థులను ఏమీ అనుకూడదు.'అని అజేయ జడేజా చురకలంటించాడు.
జైస్వాల్‌ది తప్పే..
టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కోటక్ కూడా జైస్వాల్‌ది తప్పేనని అంగీకరించాడు. అయితే ఆటలో ఇవన్నీ సహజమేనని వ్యాఖ్యానించాడు. 'అక్కడ బౌలర్ ఏవో వ్యాఖ్యలు చేశాడు. అలాంటి ఉద్విగ్న పరిస్థితుల్లో ఇలా జరగడం సహజమే. అయితే, జైస్వాల్ కూడా మరీ దగ్గరగా వెళ్లకుండా ఉండాల్సింది.'అని సితాన్ష్ కొటక్ అభిప్రాయపడ్డాడు.
భారత్ భారీ స్కోర్..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(193 బంతుల్లో 12 ఫోర్లతో 117) మరో శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.
రవీంద్ర జడేజా(43), యశస్వి జైస్వాల్(45) తృటిలో హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. క్రీజులో ధ్రువ్ జురెల్(7 బ్యాటింగ్)తో పాటు సరాన్ష్ జైన్(4 బ్యాటింగ్) ఉన్నాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. లాహిరు కుమార, కేశర నువాంత తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

