Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పసికూనే అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. తస్మాత్ జాగ్రత్త: జడేజా

Ajay Jadeja Says Wont be surprised if Afghanistan knock one of India or Pakistan out

న్యూఢిల్లీ: ఆసియా కప్ 2022లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అఫ్గానిస్థాన్ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ చాలా బలంగా ఉందని కొనియాడాడు. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన పోరులో అఫ్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్ బీ నుంచి సూపర్ 4కు అర్హత సాధించింది.

తొలి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన అఫ్గాన్ లీగ్ మ్యాచ్‌ల్లో రెండింటికి రెండు గెలిచి గ్రూప్ బీ టాపర్‌గా నిలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు సమష్టిగా రాణించింది. ఈ క్రమంలోనే అఫ్గాన్ ఆటతీరుపై క్రిక్‌బజ్ డిబేట్‌లో స్పందించిన జడేజా.. పసికూన అని తక్కువ అంచనా వేస్తే పచ్చడవుతోందని భారత్, పాక్ జట్లను హెచ్చరించాడు. భారత్, పాక్‌లను అఫ్గాన్‌ను ఓడించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు.

బలంగా బౌలింగ్

బలంగా బౌలింగ్

'తొలి మ్యాచ్‌లో శ్రీలంక, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి జోరు మీదున్న అఫ్గానిస్థాన్‌ను నిలువరించడం భారత్‌, పాకిస్థాన్ లాంటి మేటి జట్లకు కూడా బిగ్ చాలెంజ్. అఫ్గాన్‌ను అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ విభాగంతో జాగ్రత్తగా ఉండాలి. శ్రీలంకతో మ్యాచ్‌లో యువ పేసర్‌ ఫజల్‌ హాక్‌ ఫరూఖీ (3/11), ముజీబ్‌ ఉర్ రెహ్మాన్ (2/24), మహమ్మద్ నబీ (2/14) సత్తా చాటితే.. బంగ్లాతో మ్యాచ్‌లో ముజీబ్ ఉర్‌ రెహ్మాన్ (‌3/16), రషీద్‌ ఖాన్‌ (3/22) చెలరేగిన విషయం తెలిసిందే.

డేంజరస్ బ్యాటింగ్

డేంజరస్ బ్యాటింగ్

అలాగే బ్యాటింగ్‌లోనూ అఫ్గాన్‌ను చిన్నచూపు చూడకూడదు. బంగ్లాపై ఆ జట్టు బ్యాటర్లు ఇబ్రహీం జడ్రాన్‌ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు‌), నజీబుల్లా జడ్రాన్‌ (17 బంతుల్లో 43 నాటౌట్‌; ఫోర్‌, 6 సిక్సర్లు) ఏ రకంగా చెలరేగారో భారత్‌, పాక్‌ జట్లు గమనించాలి. తమ ఆటతో ప్రత్యర్థులకు ఓ హెచ్చరిక జారీ చేశారు. 'అని అజయ్ జడేజా పేర్కొన్నాడు. అయితే బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల బ్యాటింగ్, బౌలింగ్ బలహీనంగా ఉండటంతో అఫ్గాన్ చెలరేగిందని, భారత్‌తో గెలిచే సత్తా ఆ జట్టుకు లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

 భారత్ గెలిస్తే..

భారత్ గెలిస్తే..

గ్రూప్ బీ నుంచి రెండో స్థానం కోసం శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు పోటిపడుతున్నాయి. గ్రూప్‌-ఏ విషయానికొస్తే.. పాక్‌పై తొలి మ్యాచ్‌లో విజయంతో టీమిండియా సూపర్‌-4 తొలి బెర్తును (గ్రూప్‌-ఏ) దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం పాకిస్తాన్‌, హాంగ్‌కాంగ్‌ జట్లు పోటీపడుతున్నాయి. ఇవాళహాంగ్‌కాంగ్‌‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే టాప్ ప్లేస్ ఖాయమవడమే కాకుండా సూపర్ -4 బెర్త్ ఖారారు చేసుకుంటుంది. ఆ తర్వాత సూపర్ -4లో అఫ్గాన్‌తో భారత్ తలపడుతుంది.

Story first published: Wednesday, August 31, 2022, 18:46 [IST]
Other articles published on Aug 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+