
రోహిత్, ద్రవిడ్ బాధపడొచ్చు..
ముందుగా జడేజా మాట్లాడుతూ.. 'నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. బహుశా అది వింటే రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌లు బాధ పడొచ్చు. ఒక జట్టును తయారుచేసే క్రమంలో కెప్టెన్ నిత్యం వాళ్లతోనే ఉండాలి. దీర్ఘకాలం పాటు ఆటగాళ్లతో మంచి సంబంధాలు పెంచుకోవాలి. గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్‌ను సారథిగా నియమించారు. ఈ ఏడాదికాలంలో రోహిత్ ఎన్ని సిరీస్‌లు ఆడాడు.

ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లా?
నేను ఇదే చాలా రోజుల నుంచే చెబుతున్నా. సిరీస్ కు ఒక సారథిని మార్చినట్టు మార్చుతున్నారు. ఇప్పుడు కూడా చూడండి. టీ20 ప్రపంచకప్ ముగిసింది. దీని తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ లో రోహిత్ కు విశ్రాంతినిచ్చారు. ఒక జట్టులో ఒకడే నాయకుడు ఉంటే అది అందరికీ మంచిది. అలా కాకుండా ఏడుగురు సారథులుంటే ఫలితాలు ఇలానే ఉంటాయి.'అని జడేజా విమర్శించాడు.

మ్యూజికల్ చైర్ గేమ్‌లా..
ఇక వీరేంద్ర సెహ్వాగ్ కూడా రోహిత్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పదే పదే బ్రేకులు తీసుకోవాల్సినంత సీరియస్ క్రికెట్ వీళ్లు ఏం ఆడుతున్నారని ప్రశ్నించాడు. అసలు రోహిత్ ఈ ఏడాది ఎన్ని సిరీస్ ఆడాడని ప్రశ్నించాడు. ఇక సారథుల విషయానికొస్తే టీమిండియా సారథి పోస్ట్ అనేది ఓ మ్యూజికల్ చైర్ ఆటగా మారింది. కోహ్లీ నిష్క్రమణ తర్వాత రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లు భారత జట్టుకు సారథులుగా పనిచేశారు.

కోచ్‌లు కూడా..
కెప్టెన్లే కాదు కోచ్ లు కూడా మారుతున్నారు. ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్టుగానే భారత టీమ్ మేనేజ్మెంట్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు విశ్రాంతినిచ్చి ఆ స్థానంలో ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పుతున్నది. నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్ తో జరుగబోయే టీ20, వన్డే సిరీస్ లకు హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్ లు సారథులుగా ఉంటే లక్ష్మణ్ హెడ్ కోచ్ గా ఉండనున్నాడు.


Click it and Unblock the Notifications












