'భారత్‌ను కట్టడి చేయలేకపోవడంతోనే ఓడిపోయాం'


న్యూ ఢిల్లీ: దుబాయ్ వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక టోర్నీ ఆసియా కప్ విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్.. బంగ్లాలు హోరాహోరీగా పోరాడి ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠను లేపాయి. శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ తప్పిదాల కారణంగానే భారత్ చేతిలో తమ జట్టు ఓడిపోయిందని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా ఆవేదన వ్యక్తం చేశాడు.

జట్టు 3 వికెట్ల తేడాతో భారత్
ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే.. మ్యాచ్‌లో గెలిచే అవకాశాల్ని బంగ్లాదేశ్ సృష్టించుకున్నా.. పేలవ ఫీల్డింగ్ కారణంగా వాటిని చేజార్చుకుంది. అయితే బంగ్లా జట్టు ప్రదర్శనకు పలువురు సీనియర్లు ప్రశంసలు కురిపిస్తోన్నా.. ఆ దేశ కెప్టెన్ మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేశాడు.
ఒంటి కాలితోనే జట్టును గెలిపించిన కేదార్ జాదవ్

చివరి బంతి వరకూ పోరాడాం.. కానీ
మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా మాట్లాడుతూ ‘చివరి బంతి వరకూ పోరాడాం. కానీ.. మ్యాచ్‌లో చాలా ఫీల్డింగ్ తప్పిదాలు చేశాం. కనీసం 260+ స్కోరు చేయాలని టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కి సూచించాం. అయితే.. వారు 222 స్కోరుతోనే సరిపెట్టారు. అయినప్పటికీ.. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒకవేళ 240+ స్కోరు చేసి ఉండింటే మా జట్టు గెలిచేదేమో..? కొన్ని ఫీల్డింగ్ తప్పిదాలతో మ్యాచ్‌ని చేజార్చుకున్నాం' అని మొర్తజా వెల్లడించాడు.

ఆఖర్లో ఫీల్డర్ల వైఫల్యం కారణంగానే:
గాయపడిన కేదార్ జాదవ్.. పరుగు తీసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నా.. ఫీల్డర్లని మొహరించడంలో కెప్టెన్ విఫలమవగా.. ఫైనల్ టెన్షన్ కారణంగా ఫీల్డర్లు కూడా బంతిని వేగంగా అందుకుని భారత్‌పై ఒత్తిడిని పెంచడంలో విఫలమయ్యారు.

మూడుసార్లు ఫైనల్‌కి చేరినా..
కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్‌లను రనౌట్ చేసే ఛాన్స్ బంగ్లాదేశ్‌కి లభించినా.. ఫీల్డర్ల తత్తరపాటుతో అవి వృథా అయ్యాయి. దీంతో మూడుసార్లు ఫైనల్‌కి చేరినా.. ఆసియా కప్ టైటిల్ బంగ్లాదేశ్‌కి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications