For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Aiden Markram: డబుల్ సూపర్ ఓవర్‌లో గట్టెక్కినా..ఇది మా ఆట కాదు

Aiden Markram: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో డబుల్ సూపర్ ఓవర్‌లో గట్టెక్కినా తమ ఆట తీరుపై సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఉత్కంఠ పోరులో గెలిచినందుకు సంతోషంగా ఉన్నా.. తమ ఆట మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

గ్రూప్-డీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తమ రెండో లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా డబుల్ సూపర్ ఓవర్‌లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో కూడా స్కోర్లు టై కావడంతో డబుల్ సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. డబుల్ సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా గెలుపొందింది.

అతన్ని నమ్మాం..

ఈ విజయం అనంతరం మాట్లాడిన మార్క్‌రమ్.. ఒత్తిడిని జయించి విజయం సాధించడం సంతోషంగా ఉన్నా.. జట్టు ఆట తీరు మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. 'ఈ టోర్నీలో ప్రత్యర్థి జట్లు విపరీతమైన ఒత్తిడిని పెంచుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనం ఒత్తిడికి గురైతే పరిస్థితి మరింత కష్టమవుతుంది.ఈ మ్యాచ్‌లో కొన్ని విభాగాల్లో మేం అత్యుత్తమంగా ఆడలేదు. కానీ అది ఒక విధంగా ఉత్సాహాన్నిచ్చే విషయమే. ఎందుకంటే మేము ఇంకా మెరుగుపడటానికి అవకాశం ఉందని అర్థమవుతోంది. ఏదేమైనా, ఈ విజయంతో లభించిన పాయింట్లను అదృష్టంగా భావిస్తున్నా.

సూపర్ ఓవర్‌లో సాధారణంగా ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేసే బౌలర్‌కే బంతిని ఇస్తాం. లూంగి ఎంగిడి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చిన్న పొరపాట్లు చేసినా.. మ్యాచ్ చేజారుతుంది. అంతర్జాతీయ స్థాయిలో గెలుపోటముల మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుంది. కేశవ్ మహారాజ్ విషయానికొస్తే.. స్పిన్నర్‌గా అంత చిన్న గ్రౌండ్‌లో బౌలింగ్ చేయడం కష్టం. కానీ అతను మా కోసం పని పూర్తి చేస్తాడని మేం నమ్మాం.

Aiden Markram Seeks Improvement After South Africa s Dramatic Super Over Win in T20 World Cup 2026
Photo Credit: twitter (X)

ఫీల్డింగ్‌తో గెలవాలనుకున్నాం..

మేం బ్యాటింగ్‌లో కొన్ని పరుగులు తక్కువ చేశామని నాకు అనిపించింది. అందుకే బౌలింగ్, ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని జట్టుకు చెప్పాను. మా ఫీల్డింగ్ ద్వారా ఒక 10-15 పరుగులు ఆదా చేయగలిగితే మ్యాచ్‌ను గెలవొచ్చని భావించాను. టీ20 ఫార్మాట్‌లో ఇలాంటి చిన్న చిన్న విషయాలే చివరకు పెద్ద తేడాను చూపుతాయి.

మా ఓపెనర్లు ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. తమ బలానికి అనుగుణంగా ఆడుతూ మాకు మంచి పునాది వేస్తున్నారు. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం మాకు సమస్యగా మారింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇలాగే జరిగింది. ఈ బలహీనతను మేం అధిగమించాలి. ఒత్తిడిలో గెలిచిన ఈ మ్యాచ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకొని నైపుణ్యాన్ని నిరూపించుకోవడం జట్టుకు పెద్ద సానుకూల అంశం.'అని మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.

నరాలు తెగే ఉత్కంఠ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేయగా.. అనంతరం అఫ్గానిస్థాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది. తొలి సూపర్ ఓవర్‌లో అఫ్గాన్ 17 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా కూడా సరిగ్గా 17 పరుగులే చేసింది. రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా 23 పరుగులు చేయగా.. అఫ్గానిస్థాన్ 19 పరుగులే చేసి ఓటమిపాలైంది. సూపర్ ఓవర్‌లో ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన స్థితిలో గుర్బాజ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Wednesday, February 11, 2026, 20:34 [IST]
Other articles published on Feb 11, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+