హైదరాబాద్: పేలవ బ్యాటింగ్‌తో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మార్క్‌రమ్.. జట్టులో గెలవాలనే తపన లోపించిందని చెప్పాడు.
బౌలర్లు అద్భుతంగా రాణించినా బ్యాటింగ్ వైఫల్యం ఓటమికి కారణమైందన్నాడు. 'చెత్త బ్యాటింగ్, గెలవాలనే కసి లేకపోవడం మా ఓటమిని శాసించింది. మేం స్వేచ్చగా బ్యాటింగ్ చేసే విషయంపై ఫోకస్ పెట్టాలి. మా తప్పిదాలను సరిదిద్దుకోవాలి. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలనుకున్నాం. కానీ ఆ దిశగా బ్యాటింగ్ చేయలేకపోయాం. ఈ రోజు గెలవాలనే ఇంటెంట్ మాలో లోపించింది. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాం.

నిజాయితీగా మాట్లాడటం నాకు ఇష్టం. కుర్రాళ్లను ఉత్సాహపరచడాన్ని నేను ఆస్వాదిస్తాను. మా ఆటగాళ్లు మరింత కష్టపడాలి. మా బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. ఈ ఓటమికి మా బౌలర్లు ఏ మాత్రం అర్హులు కారు. ఈ మ్యాచ్‌లో మాకున్న ఏకైక సానుకూలంశం మా బౌలింగ్ ప్రదర్శనే.'అని మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(34 బంతుల్లో 4 ఫోర్లతో 34), మనీశ్ పాండే(27 బంతుల్లో 2 ఫోర్లతో 34) మినహా అంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో సుందర్ మూడు వికెట్లు తీయగా.. భువీ రెండు వికెట్లు పడగొట్టారు. నటరాజన్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసి ఓటమిపాలైంది. మయాంక్ అగర్వాల్(39 బంతుల్లో 7 ఫోర్లతో 49), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), వాషింగ్టన్ సుందర్(15 బంతుల్లో 3 ఫోర్లతో 24 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసారు.