Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది లేకనే ఓటమి పాలయ్యాం: మార్క్‌రమ్ మామ

హైదరాబాద్: సమష్టి వైఫల్యంతో పాటు డ్యూ ప్రభావం లేకపోవడంతో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమిపాలయ్యామని సన్‌‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎయిడెన్ మార్క్‌రమ్ తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.

తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వకపోవడంతో పాటు బౌలింగ్‌లో అదనంగా పరుగులివ్వడం తమ పతనాన్ని శాసించిందన్నాడు. విజయం కోసం చివరి వరకు తమ ఆటగాళ్లు చేసిన పోరాటం ఆకట్టుకుందున్నాడు. 'మేమంతా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయాం. మ్యాచ్ చివరి ఓవర్ వరకు మా ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. బౌలింగ్ చివర్లో అదనంగా పరుగులు సమర్పించుకున్నాం.

Aiden Markram Reaction

ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్‌కు పిచ్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయితే కొన్ని బంతులు బ్యాట్‌పైకి రాలేదు. డ్యూ ప్రభావం ఉంటుందనే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాం. ఒకవేళ డ్యూ ప్రభావం ఉండి ఉంటే మాత్రం మేం సునాయసంగా గెలిచే వాళ్లం.

గత సీజన్ వైఫల్యాలను అధిగమించకపోవడం బాధగా ఉంది. అయితే మరి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. మేం కొన్ని ప్రదేశాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. తదుపరి మ్యాచ్‌కు మా తప్పిదాలను సరిదిద్దుకొని బరిలోకి దిగుతాం. విజయం కోసం ప్రయత్నిస్తాం.'అని ఎయిడెన్ మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. లోకల్ బాయ్ తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37), ఓపెనర్లు రోహిత్ శర్మ(18 బంతుల్లో 6 ఫోర్లతో 28), ఇషాన్ కిషన్(31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) మెరుపులు మెరిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 19.5 ఓవర్లలో 178 పరుగులకు కుప్పకూలింది. మయాంక్ అగర్వాల్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 48), హెన్రీచ్ క్లాసెన్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) మినహా అంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్, రిలీ మెరిడిత్, పియూష్ చావ్లా తలో వికెట్ తీయగా.. అర్జున్ టెండూల్కర్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, April 19, 2023, 6:05 [IST]
Other articles published on Apr 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+