Aiden Markram: వారి వల్లే ఈ ఘోర పరాజయం!
Aiden Markram: భారత బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవి చూసామని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ అన్నాడు. తొలి బంతి నుంచి తమపై ఆధిపత్యం చెలాయించారని కొనియాడాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన భారత్ 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.
ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మార్క్‌రమ్ తమ పరాజయంపై స్పందించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని సమర్థించుకున్నాడు. 'ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయాలనుకున్నాం.

కానీ భారత బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ గెలుపు క్రెడిట్ భారత బౌలర్లదే. తొలి బంతి నుంచే మాపై ఆధిపత్యం చెలాయించారు. ఆ తర్వాత పుంజుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆరంభంలో ఈ పిచ్ కాస్త బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని ముందుగానే ఊహించాం.
ముఖ్యంగా తొలి 6-7 ఓవర్లు పిచ్ బౌలర్లకు సహకరిస్తుందని మాకు తెలుసు. కానీ ఈ రోజు ఇంకాస్త ఎక్కువగా బౌలర్లకు అనుకూలించింది. భారత బౌలర్లు కూడా సరైన ప్రదేశాల్లో బంతులు వేసారు. వ్యక్తిగతంగా మా ప్రదర్శనపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ తరహా పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్మార్ట్ ఆప్షన్స్ ఎంచుకోవాలి.'అని మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్ (4/27) సఫారీ పతనాన్ని శాసించారు. ఫారీ బ్యాటర్లలో ఆండిలే పెహ్లుక్వాయో(49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), టోనీ డీ జోర్జీ(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 16.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 117 పరుగులు చేసి 200 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. రుతురాజ్ గైక్వాడ్(5) విఫలమైనా.. అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్(43 బంతుల్లో 9 ఫోర్లతో 55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్దర్, ఆండిలో పెహ్లుక్వాయో తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications