సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఎయిడెన్ మార్క్‌రమ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. భారత్‌తో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతమైన డైవ్‌లో సింగిల్ హ్యాండ్‌తో అందిపుచ్చుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు నితీష్ కుమార్ రెడ్డితో పాటు అంపైర్లు అవాక్కయ్యారు.
వాటే క్యాచ్ అంటూ సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'మార్క్‌రమ్ మామ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. పోలా అదిరిపోలా!'అని కామెంట్ చేస్తున్నారు.
రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా భారత తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మార్కో జాన్సెన్ వేసిన 42వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని జాన్సెన్ షార్ట్ బాల్‌గా వేయగా.. నితీష్ కుమార్ రెడ్డి డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అతని గ్లోవ్స్ తాకిన బంతి గాల్లోకి లేవగా.. మూడో స్లిప్ ఫీల్డర్‌గా ఉన్న మార్క్‌రమ్ అద్భుతంగా పరుగెత్తి కుడివైపు డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. దాంతో నితీష్ కుమార్ రెడ్డి(10) నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(97 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 58) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(22), సాయి సుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0), రిషభ్ పంత్(7), నితీష్ కుమార్ రెడ్డి(10), రవీంద్ర జడేజా(6) తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో 122 పరుగులకే భారత్ 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కుల్దీప్ యాదవ్(122 బంతుల్లో 3 ఫోర్లతో 19)తో కలిసి వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 48) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. హాఫ్ సెంచరీకి చేరువైన వాషింగ్టన్ సుందర్‌ను హర్మర్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 8వ వికెట్‌కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు తీయగా.. హర్మర్(3/64) మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే 104 పరుగులు చేయాలి.