Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఒక్కడే మా ఓటమిని శాసించాడు: సౌతాఫ్రికా కెప్టెన్

న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాసించాడని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ అన్నాడు. పవర్ ప్లేలోనే తమ ఓటమిని ఖాయం చేశాడని తెలిపాడు. మ్యాచ్ ఆరంభంలో పిచ్ కూడా బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉందని, బంతి బ్యాట్‌పైకి రాలేదని చెప్పాడు. పరుగులు చేయాలనే ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయామని పేర్కొన్నాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో బుధవారం కోల్‌కతా వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. దాంతో ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్ చేరిన సౌతాఫ్రికా.. ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

బౌలింగ్ సూపరో సూపర్..

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మార్క్‌రమ్.. బ్యాటింగ్ వైఫల్యం తమ పతనాన్ని శాసించిందన్నాడు. 190 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లు అసాధారణ ప్రదర్శన కూడా తమ విజయవకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. ఫిన్ అలెన్, టీమ్ సీఫెర్ట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించారని తెలిపాడు. 'మ్యాచ్ ఆరంభంలో పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.

ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా వారి బౌలింగ్ విభాగానిదే. ఆరంభంలో పిచ్ కూడా బ్యాటింగ్‌‌కు ప్రతికూలంగా ఉంది. కొన్ని బంతులు ఆగుతూ వస్తే.. మరికొన్ని బంతులు తక్కువ ఎత్తులో వచ్చాయి. దాంతో పరుగులు చేయడం కష్టమైంది. ఆ ఒత్తిడిలో మేం వరుసగా వికెట్లు కోల్పోయాం.

Aiden Markram Credits New Zealand s Bowling Unit and Finn Allen Century for South Africa s Semi Final Exit
Photo Credit: screen grab for JioHotstar

ఈ ఓటమి మాకు చెంప దెబ్బ..

ఇక ప్రత్యర్థి జట్టులో ఎవరో ఒకరు ఫిన్ అలెన్ తరహా ఇన్నింగ్స్ ఆడినప్పుడు.. ఫీల్డింగ్ టీమ్‌గా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ మ్యాచ్‌లో మేం 170 పరుగులు చేయడం గొప్ప ప్రయత్నమే. న్యూజిలాండ్ పవర్ ప్లేలోనే దూకుడుగా ఆడి మంచి ఆరంభాన్ని అందుకుంది. మ్యాచ్‌ను ఇంత త్వరగా ముగించినందుకు ఫిన్ అలెన్, సీఫెర్ట్ ఇన్నింగ్స్‌లకు భారీ క్రెడిట్ ఇవ్వాలి. పిచ్ బాగుంటుందని, బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని మేం ఊహించాం.

బహుశా మేం కష్టపడి 190 పరుగులు చేసి ఉంటే మ్యాచ్‌లో నిలిచేవాళ్లమేమో. ఈ ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ ఈ టోర్నీలో మా జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. ఈ ఓటమి మాకు చెంప దెబ్బ. ముందుగా ఈ ఓటమి బాధ నుంచి తేరుకున్నాక.. జట్టుగా కూర్చుని ఈ ఫలితంపై చర్చించుకుంటాం. మా తప్పిదాలను సవరించుకొని తిరిగి పుంజుకుని మళ్ళీ బలంగా వస్తాం. ప్రస్తుతం చాలా నిరాశగా ఉన్నాం. ఒక జట్టుగా మేము మరింత బలంగా, మెరుగ్గా తిరిగి రావాలి.'అని మార్క్‌రమ్ చెప్పుకొచ్చాడు.

శతక్కొట్టిన ఫిన్ అలెన్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్(30 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(2/34), కోల్ మెక్‌కాంచీ(2/9), రచిన్ రవీంద్ర(2/29) రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం న్యూజిలాండ్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 173 పరుగులు చేసి గెలుపొందింది. ఫిన్ అలెన్(33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. టీమ్ సీఫెర్ట్(33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా ఒక్కడే ఒక వికెట్ తీసాడు.

Story first published: Wednesday, March 4, 2026, 23:04 [IST]
Other articles published on Mar 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+