టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీకి మార్గం సుగుమమైంది. తీవ్ర గాయంతో కొన్ని రోజులుగా భారత జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)లో ఇంటెన్సివ్ రిహాబ్‌ను పూర్తి చేసిన శ్రేయస్ అయ్యర్.. మ్యాచ్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో భాగంగా విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు.
ఈ లీగ్‌లో ముంబై ఆడాల్సిన చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. ముంబై రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ గాయంతో జట్టుకు దూరం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించిన ముంబై.. ఎలైట్ గ్రూప్ సీలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రతో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై 128 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. జనవరి 6న హిమాచల్ ప్రదేశ్, 8న పంజాబ్‌తో తలపడనుంది. ఈ రెండింటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా ముంబై క్వార్టర్స్ చేరుతుంది.
దాంతో ఈ మ్యాచ్‌లు ముంబైకి కీలకం మారాయి. శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్‌ల్లోనే ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. అప్పుడే అతనికి క్లియరెన్స్ సర్టిఫికేట్ వస్తుంది. అప్పుడే జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో అయ్యర్‌కు అవకాశం దక్కుతుంది. ఈ సిరీస్‌కు అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే మ్యాచ్ ఆడుతాడని సెలెక్టర్లు స్పష్టం చేశారు. తొలి వన్డే జనవరి 11న వడోదర, రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్ వేదికగా, మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరగనుంది.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications