Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్‌స్పోర్ట్స్‌ ప్లాన్.. ఐపీఎల్ 2020కి ఇంటి నుంచే కామెంట్రీ!!

After sound check from South Africa, commentary from home likely in IPL 2020

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని రంగాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆటలకు సంబంధించిన అంశాల్లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్ ‌(ఐసీసీ) చాలా మార్పులు తీసుకొచ్చింది. ఉమ్మి (సలైవా)పై నిషేధం, ద్వైపాక్షిక సిరీస్‌లను స్థానిక అంపైర్లతో నిర్వహించడం, టెస్టుల్లో కొవిడ్‌-19 సబ్‌స్టిట్యూట్‌, టెస్టుల్లో మూడు డీఆర్‌ఎస్‌ రివ్యూలు, వన్డే-టీ20లకు రెండు రివ్యూలు, టెస్టు జెర్సీపై అదనపు లోగో వంటి కొత్త రూల్స్ ఐసీసీ తీసుకొచ్చింది. వీటన్నింటిని ఇంగ్లండ్‌-వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో అమలు చేస్తున్నారు.

 ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు

ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు

మరోవైపు ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని భావించిన ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బయో సెక్యూర్ బబుల్.వాతావరణంలో మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. ఈసీబీ క్రికెట్ స్టేడియాల్లోకి ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. ఇక ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల్ని తొలుత 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచి.. ఆ తర్వాత వైరస్ పరీక్షల అనంతరమే ఆటలోకి అనుమతిస్తున్నారు. ఇదే విధానాన్ని ఐపీఎల్ 2020లో కూడా బీసీసీఐ అవలంబించనుంది. అయితే బబుల్‌లోకి క్రికెట్ కామెంటేటర్‌లను చేర్చడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే ఐపీఎల్ ప్రసరదారు స్టార్ స్పోర్ట్స్ 'వర్చువల్ కామెంట్రీ'‌ని తెరపైకి తెచ్చింది.

కామెంట్రీలో స్పష్టత కొరత

కామెంట్రీలో స్పష్టత కొరత

ఇటీవల దక్షిణాఫ్రికాలో కొత్త ఫార్మాట్లో నిర్వహించిన 3టీసీ సాలిడారిటీ కప్‌ మ్యాచ్‌లో వర్చువల్ కామెంట్రీ విధానంలో వ్యాఖ్యానం కొనసాగించారు. భారత్‌ నుంచి ఇర్ఫాన్‌ పఠాన్ (బరోడా)‌, దీప్‌ దాస్‌గుప్తా (కోల్‌కతా), సంజయ్‌ మంజ్రేకర్‌ (ముంబై) తమ ఇళ్ల నుంచే ఆ మ్యాచ్‌కు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అది విజయవంతం కావడంతో.. ఐపీఎల్‌లోనూ అదే విధానాన్ని అవలంబించే అవకాశాలున్నాయి. హిందీ, ఆంగ్లంలో కాకపోయినా.. ప్రాంతీయ భాషలు తమిళం, తెలుగు, బెంగాళీ, కన్నడల్లోనైనా ఆ ప్రయోగాన్ని చేయాలని స్టార్ స్పోర్ట్స్ భావిస్తోంది. ఇంటర్నెట్ స్పీడ్, టెక్నికల్ సమస్య ఎదురైతే.. కామెంట్రీలో స్పష్టత కొరవడుతుంది.

 స్టార్‌ ఇండియా అసంతృప్తి

స్టార్‌ ఇండియా అసంతృప్తి

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ షెడ్యూల్‌పై ప్రసారదారు స్టార్‌ ఇండియా అసంతృప్తితో ఉంది. టోర్నీని మరో వారం రోజులు పొడిగించాలని స్టార్‌స్పోర్ట్స్ డిమాండ్ చేస్తోంది. దీంతో స్టార్‌ నిర్ణయాలకు అనుగుణంగా షెడ్యూల్‌తో పాటు మ్యాచ్‌ సమయాల్లో మార్పులు చేయడానికి బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. స్టార్‌ ఇండియా ఒత్తిడి నేపథ్యంలో సెప్టెంబర్‌ 26 నుంచి కాకుండా.. సెప్టెంబర్‌ 19 నుండే లీగ్ ప్రారంభించాలని బీసీసీఐ చూస్తోందట.

'వైరస్ తీవ్రత ఇలాగే కొనసాగితే.. వచ్చే ఏడాదీ మెగా ఈవెంట్‌ అసాధ్యమే'

Story first published: Thursday, July 23, 2020, 9:46 [IST]
Other articles published on Jul 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+