Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ క్రికెట్ బోర్డును ఆడుకుంటున్న కరోనా.. పదిలో ఆరుగురికి నెగటీవ్

After Mohammad Hafeez, five other Pakistan players test negative

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కరోనా వైరస్ ఓ ఆట ఆడుకుంటుంది. మహమ్మారి టెస్ట్‌ల విషయంలో బోర్డుకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన 29 మంది ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 10 మందికి కరోనా వైరస్ సోకిందని తేలింది.
వారందరినీ సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోవాలని పీసీబీ ఆదేశించగా.. మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ మాత్రం సాహసోపేతంగా ప్రైవేట్‌ ల్యాబ్‌లో టెస్టులు చేయించుకున్నాడు. ఆ టెస్టులో నెగటివ్ రావడంతో.. సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని వెల్లడించి బోర్డుకు ఓ పెద్ద సమస్యను తీసుకొచ్చాడు.

నెగటీవ్.. పాజిటివ్

నెగటీవ్.. పాజిటివ్

ఒక్క రోజు వ్యవధిలోనే హఫీజ్‌కు నెగటివ్ రావడంతో అలర్ట్ అయిన పీసీబీ.. శుక్రవారం హఫీజ్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపింది. దాంతో.. సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్లకుండా పరీక్షల కోసం ఫ్యామిలీతో కలిసి ప్రైవేట్ ల్యాబ్‌కి వెళ్లిన హఫీజ్‌పై చర్యలు తీసుకునేందుకు కూడా పీసీబీ సిద్ధమైంది.

మళ్లీ ఆరుగురికి నెగటీవ్

మళ్లీ ఆరుగురికి నెగటీవ్

ఇక శనివారం మరోసారి 10 మంది ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించగా.. ఇందులో హఫీజ్‌తో సహా ఆరుగురికి నెగటివ్ వచ్చినట్లు పాకిస్థాన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సాజ్ సాధిక్ వెల్లడించారు. హఫీజ్‌తో పాటు వాహబ్ రియాజ్, మహ్మద్ హస్నైన్, షాదాబ్ ఖాన్, ఫకార్ జమాన్, మమ్మద్ రిజ్వాన్‌లకు నెగటీవ్ వచ్చినట్లు సాజ్ సాధిక్ ట్వీట్ చేశారు. అయితే పీసీబీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

టెస్టింగ్ సామర్థ్యంపై..

టెస్టింగ్ సామర్థ్యంపై..

పాకిస్థాన్‌లో కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్స్ సామర్థ్యంపై తొలి నుంచి అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా వారం వ్యవధిలో 10 మంది ఆటగాళ్లకి కరోనా పాజిటివ్, నెగటివ్ రావడం.. మధ్యలో హఫీజ్‌కి పాజిటివ్, నెగటివ్.. పాజిటివ్.. నెగటివ్ రావడంతో పాక్ క్రికెట్‌లో మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది. స్టార్ క్రికెటర్లకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది.

20 మందితో ఇంగ్లండ్ పయనం..

20 మందితో ఇంగ్లండ్ పయనం..

ఇంగ్లండ్ పర్యటనకు 20 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు ఈ ఆదివారం(జూన్ 28) బయల్దేరనుందని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. జట్టు వివరాలను సైతం ట్వీట్ చేసింది. 14 రోజుల సెల్ఫ్ ఐసోలేషన్ తర్వాత పాక్ ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌లు, మూడు టీ20లు ఆడనుంది.

Story first published: Saturday, June 27, 2020, 20:57 [IST]
Other articles published on Jun 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+