Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కోహ్లీ డకౌట్.. 13 ఏళ్లలో ఇదే తొలిసారి!

సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి మ్యాచ్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. 8 బంతులాడి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్ కొన్నోల్లీ స్టన్నింగ్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు.

224 రోజుల తర్వాత భారత్ తరఫున బరిలోకి దిగన కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దాంతో కోహ్లీ ఓ చెత్త రికార్డ్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.

13 ఏళ్లలో ఇదే తొలిసారి..

ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో తొలి సారి డకౌటయ్యాడు. 2012 ఫిబ్రవరి 5న మెల్‌బోర్న్ వేదికగా తొలి వన్డే ఆడిన కోహ్లీ.. ఇప్పటి వరకు 30 వన్డేలు ఆడాడు. తాజా ఇన్నింగ్స్‌లోనే కోహ్లీ పరుగులు చేయకుండా వెనుదిరిగాడు.

ఓవరాల్‌గా కోహ్లీకి ఇది 39వ డకౌట్. మూడు ఫార్మాట్లలో కలిసి 551 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 39 సార్లు పరుగుల ఖాతా తెరవకుండా వెనుదిరిగాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్(44), ఇషాంత్ శర్మ(40) కోహ్లీ కన్నా ముందు ఉండగా.. హర్భజన్ సింగ్(37), జస్‌ప్రీత్ బుమ్రా(35) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

After 13 Years Virat Kohli Creates Unwanted Record With Duck Against Australia in Perth

రోహిత్, గంగూలీ రికార్డ్ బ్రేక్..

వన్డేల్లో కోహ్లీకి ఇది 17వ డక్‌ కాగా.. ఈ జాబితాలో అతను సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మలను అధిగమించాడు. గంగూలీ, రోహిత్ వన్డేల్లో చెరో 16 సార్లు డకౌటయ్యారు. వన్డేల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు.

అతను 463 వన్డేల్లో 20 సార్లు డకౌటయ్యాడు. అతని తర్వాత జవగళ్ శ్రీనాథ్(19), అనిల్ కుంబ్లే(18), యువరాజ్ సింగ్(18), హర్భజన్ సింగ్(17), విరాట్ కోహ్లీ(17) కొనసాగుతున్నారు.

మ్యాచ్‌కు అంతరాయం..

పదే పదే వర్షం అంతరాయం కలిగిస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0) తీవ్రంగా నిరాశపర్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(10), శ్రేయస్ అయ్యర్(11) సైతం వారి బాటలో నడిచారు. దాంతో టీమిండియా 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రాహుల్, అక్షర్ పటేల్(11) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వర్షం రెండు సార్లు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 32 ఓవర్లకు కుదించారు.

Story first published: Sunday, October 19, 2025, 13:06 [IST]
Other articles published on Oct 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+