రోడ్డు ప్రమాదానికి గురైన అఫ్గానిస్థాన్ క్రికెటర్

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తు అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆ దేశ సీనియర్ జర్నలిస్ట్, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) మాజీ మీడియా మేనేజర్ ఇబ్రహిం మోమంద్ ట్విటర్ వేదికగా తెలియజేశాడు. ఆయన షేర్ చేసిన ఫొటోలను చూస్తే అఫ్సర్ కారు పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తుంది. ఇక అఫ్సర్ తలకు బ్యాండేజ్ చూస్తే.. స్వల్ప గాయాలతో బయపడినట్లు అర్థం అవుతుంది. మొత్తానికి భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అఫ్గానిస్థాన్ తరఫున 17 వన్డేలు, ఒక టీ20, ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడిన అఫ్సర్ జజాయ్.. గతేడాది కాలంగా అఫ్గాన్ జట్టు ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ మధ్యలో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ షెహజాద్ గాయపడగా.. అఫ్సర్ జజాయ్‌కి అవకాశం దక్కింది. 2013లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ 26 ఏళ్ల వికెట్ కీపర్‌కు.. షెహజాద్ నిలకడగా రాణించడంతో గత ఏడాది వరకూ పెద్దగా అవకాశాలు రాలేదు. భారత్ తరఫున జరిగిన ఎకైక టెస్ట్ మ్యాచ్‌లో కూడా అఫ్సర్ ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications