Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Afghanistan Playing XI: షష్మతుల్లా ఇన్.. ముజీబ్ డౌట్! భారత్‌తో బరిలోకి దిగే అఫ్గాన్ తుది జట్టు ఇదే!

Afghanistan Playing 11 vs India T20 World Cup 2021: Mujeeb ur Rahman Doubt And Hashmatullah Shahidi In

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అఫ్గానిస్థాన్ మరో కీలక పోరుకు సిద్దమైంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తమ కంటే బలమైన టీమిండియాతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే టోర్నీలో పేలవ బ్యాటింగ్, పసలేని బౌలింగ్‌తో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం కోల్పోయిన కోహ్లీసేనను దెబ్బతీయాలనే పట్టుదలతో అఫ్గాన్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి నాకౌట్‌ రేసులో నిలవాలని భావిస్తోంది. నమీబియా, స్కాట్లాండ్‌పై భారీ విజయాలందుకున్న అఫ్గాన్.. పటిష్ట పాకిస్థాన్‌‌ను ఓడించినంత పనిచేసింది. ఇప్పుడు అదే జోరుతో భారత్‌కు షాకివ్వాలనుకుంటుంది. మరో వైపు భారత్‌ మాత్రం సెమీస్ ఆశలు సన్నగిల్లడంతో తదుపరి మ్యాచ్‌లు గెలిచి గౌరవంగా తప్పుకోవాలనుకుంటుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అఫ్గాన్ తుది జట్టుపై ఓ లుక్కెద్దాం.

పటిష్టంగా అఫ్గాన్..

పటిష్టంగా అఫ్గాన్..

అఫ్గానిస్థాన్‌పై టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు తలపడిన భారత్‌ రెండు సార్లూ గెలుపొందింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫార్మాట్‌లో ఆ జట్టు ఎంతో మెరుగు పడింది. ఒక ఓవర్‌ ఫలితాన్ని మార్చేసే అవకాశం ఉన్న టీ20ల్లో అఫ్గాన్‌ ఎన్నో సార్లు సంచలనాలకు చేరువగా వచ్చింది. ఈ టోర్నీలో కూడా ఆసిఫ్‌ అలీ అనూహ్యంగా చెలరేగి ఉండకపోతే పాక్‌పై కూడా అఫ్గాన్‌ గెలిచేదేమో! కాబట్టి టీమ్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఒకవైపు వికెట్లు పడినా, మరోవైపు ఆత్మరక్షణలో పడకుండా ధాటిగా ఆడుతూ చకచకా పరుగులు సాధించగల బ్యాట్స్‌మెన్‌ జట్టులో ఉన్నారు.

అస్గర్ ప్లేస్‌లో ఉస్మాన్..

అస్గర్ ప్లేస్‌లో ఉస్మాన్..

అఫ్గాన్ ఓపెనర్లుగా హజ్రతుల్లా హెహజాద్ బరిలోకి దిగనున్నారు. ఈ జోడీ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. జట్టుకు కావాల్సిన మంచి శుభారంభాలు అందిస్తుంది. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోయిన భారత బౌలింగ్ విభాగాన్ని ఈ జోడీ ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడాలి. ఫస్ట్ డౌన్ రహ్మానుల్లా బరిలోకి దిగనుండగా.. మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ అస్గర్ అఫ్గాన్ తప్పుకోవడంతో హష్మతుల్లా, ఉస్మాన్‌లలో ఒకరికి చోటు దక్కనుంది. ఆల్‌రౌండర్లుగా నజీబుల్లా, నబీ బరిలోకి దిగనున్నారు. కెప్టెన్‌ నబీకి భారీ షాట్లు ఆడగల నైపుణ్యం ఉంది. అఫ్గాన్‌ టీమ్‌కు కూడా యూఏఈ వేదికలపై మంచి అనుభవం ఉంది. అన్నింటికి మించి టీమ్‌లో స్పిన్నర్ల 12 ఓవర్లు మ్యాచ్‌ను శాసిస్తాయి.

ముజీబ్ డౌట్..

ముజీబ్ డౌట్..

రషీద్‌ ఖాన్, నబీ, ముజీబ్‌లు సత్తా చాటితే భారత బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. ముఖ్యంగా స్పిన్నర్లు రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌లు బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించగలరు. టోర్నీలో ఇప్పటివరకు రషీద్‌ మూడు మ్యాచ్‌ల్లో కేవలం 4.74 ఎకానమీ రేట్‌తో 7 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్‌ రెండు మ్యాచ్‌ల్లో 4.25 ఎకానమీతో 6 వికెట్లు చేజిక్కించుకున్నాడు. అయితే ఆఫ్గాన్‌ కొత్త బంతి బౌలర్లు హమీద్‌, నవీనుల్‌లు మంచి బౌలర్లే అయినా.. భారత ఓపెనర్లను నిలువరించడం వారికి సవాలే. ఎలాగైనా రాణించాలనే కసితో ఉన్న భారత బౌలర్లకు నిలిచి నజిబుల్లా, షెజాద్‌ తదిరులు ఎలా రాణిస్తారో చూడాలి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో గాయపడిన ముజీబ్ ఈ మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.

అఫ్గానిస్థాన్‌ తుది జట్టు(అంచనా):

అఫ్గానిస్థాన్‌ తుది జట్టు(అంచనా):

మహమ్మద్ నబీ (కెప్టెన్‌), హజ్రతుల్లా, షహజాద్, రహ్మానుల్లా, హష్మతుల్లా/ఉస్మాన్, నజీబుల్లా, గుల్బదిన్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్, హసన్‌.

Story first published: Wednesday, November 3, 2021, 10:39 [IST]
Other articles published on Nov 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+