IND vs AFG: అఫ్గాన్‌దే బ్యాటింగ్.. మూడు మార్పులతో టీమిండియా!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తెలిపాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన రీతిలో రాణించలేకపోయామని, ఆ తప్పిదాలను ఈ మ్యాచ్‌లో సరిచేసుకుంటామని తెలిపాడు. తుది జట్టులో నాలుగు మార్పులు చేసినట్లు చెప్పాడు.
గెలిచేందుకు ప్రయత్నిస్తాం..
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ఈ నెల భారత్‌లో ఎప్పుడూ హాట్‌గానే ఉంటుంది. పిచ్ చూడటానికి బాగుంది. డ్రైగా హార్డ్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో మేం శుభారంభం అందుకుంటామని ఆశిస్తున్నా. గత రెండు మ్యాచ్‌ల్లో మేం కొన్ని తప్పిదాలు చేశాం.
ఆశించిన రీతిలో రాణించలేకపోయాం. ఈ మ్యాచ్‌లో వాటిని సరిచేసుకుంటామని భావిస్తున్నా. తుది జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. నబీ, అజ్మత్ రీఎంట్రీ ఇవ్వగా.. జియూర్ రెహ్మాన్, ఫరీద్ మాలిక్ తుది జట్టులోకి వచ్చారు.'అని హష్మతుల్లా షాహిది చెప్పుకొచ్చాడు.

మూడు మార్పులు చేశాం..
మరోవైపు టాస్ గెలిస్తే తాము బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. తుది జట్టులో మూడు మార్పులు జరిగాయని చెప్పాడు. 'ఈ పిచ్ చాలా బాగున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ మేం టాస్ గెలిచి ఉంటే ముందుగా బ్యాటింగే ఎంచుకునేవాళ్లం. గత మ్యాచ్‌లో ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ కూడా పరిస్థితి ఏమాత్రం భిన్నంగా ఉండబోదు.
మేం అనుకున్న ప్రణాళికలను సమర్ధవంతంగా అమలు చేయడంపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో మేం ఛేజింగ్ చేయబోతున్నాం. భారీ స్కోర్లను సునాయసంగా ఛేదించడం అనేది మేం ఇంకా పూర్తి అధిగమించని ఒక అంశం. ఈ రోజు మేం అదే చేయాలని చూస్తున్నాం. తుది జట్టులో మూడు మార్పులు జరిగాయి. ప్రసిద్ధ్, హర్ష్ దూబే, నితీష్ రెడ్డి జట్టులోకి తిరిగి వచ్చారు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
అఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), దర్విష్ రసూలీ, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ గజన్‌ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.
ఇండియా : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

