For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విషాదం.. స్టార్ క్రికెటర్ కూతురు మృతి!

అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని రెండేళ్ల కుమార్తె మృతి చెందింది. ఈ విషయాన్ని హజ్రతుల్లా సహచర క్రికెటర్ కరీం జనత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 'నా బెస్ట్ ఫ్రెండ్ హజ్రతుల్లా జజాయ్ తన కూతురిని కోల్పోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని తీవ్ర బాధతో పంచుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో హజత్రుల్లా కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'అని ఇన్‌స్టా వేదికగా జనత్ పేర్కొన్నాడు. అయితే ఆ చిన్నారి మృతికి గల కారణం తెలియరాలేదు.

జజాయ్ కుమార్తె మృతి పట్ల అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా సంతాపం ప్రకటించింది. 2016లో యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌తో జజాయ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అఫ్గానిస్థాన్ టీ20 టీమ్ అతను కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. హజ్రతుల్లా తన కెరీర్‌లో ఇప్పటివరకు అఫ్గాన్ తరఫున 16 వన్డేలు, 45 టీ20లు ఆడాడు. వన్డేల్లో 361 పరుగులు చేయగా.. టీ20ల్లో 1160 పరుగులు చేశాడు.

Afghanistan cricketer Hazratullah Zazai s daughter dies

అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపికైన జట్టులో జజాయ్ లేడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా జజాయ్ కొనసాగుతున్నాడు. డెహ్రాడూన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ 62 బంతుల్లో 11 ఫోర్లు, 11 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. అతను చివరిసారిగా గతేడాది డిసెంబర్‌లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లోఅఫ్గాన్ తరఫున ఆడాడు.

Story first published: Friday, March 14, 2025, 17:13 [IST]
Other articles published on Mar 14, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+