For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ క్యాచ్ వదిలేయడం మా కొంపముంచింది: అఫ్గానిస్థాన్ కెప్టెన్

Hashmatullah Shahidi, AFG vs AUS: గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నేలపాలు చేయడం తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఓ దశలో విజయానికి చేరువగా వచ్చిన అఫ్గాన్.. మ్యాక్స్‌వెల్ విధ్వంసకర డబుల్ సెంచరీతో ఓటమికి తల వంచింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హష్మతుల్లా షాహిది.. ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు.మ్యాక్స్‌వెల్ ఒక్కడే తమ ఓటమిని శాసించాడని తెలిపాడు. 'ఈ పరాజయం తీవ్రంగా నిరాశపరిచింది. క్రికెట్ చాలా ఫన్నీ గేమ్. ఈ ఓటమిని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాం.

Afghanistan Captain Hashmatullah Shahidi says dropped chances hurt us After Australia win

మా బౌలర్లు అద్భుతంగా ప్రారంభించారు. కానీ మ్యాక్స్‌వెల్ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేయడం తీవ్ర నష్టం చేసింది. ఈ అవకాశంతో మ్యాక్సీ చెలరేగాడు. అతన్ని ఔట్ చేసేందుకు మా బౌలర్లు సాయశక్తులా ప్రయత్నించారు. కానీ అతను ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. మా జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. ఈ మ్యాచ్ ఇలా ఓడిపోతామని అస్సలు ఊహించలేదు. క్రికెట్‌లో ఇవన్నీ సహజమే.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మరింత బలంగా బరిలోకి దిగుతాం. విజయం కోసం సాయశక్తులా ప్రయత్నిస్తాం. ఇబ్రహీమ్ జడ్రాన్ సెంచరీ అందుకోవడం గర్వంగా ఉంది.'అని హష్మతుల్లా షాహిది చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఇబ్రహీమ్ జడ్రాన్(143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 129 నాటౌట్) రికార్డు సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసి గెలుపొందింది. మ్యాక్సెవెల్(128 బంతుల్లో 21 ఫోర్లు 10 సిక్సర్లతో 201 నాటౌట్) విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు.

91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కమిన్స్‌తో కలిసి మ్యాక్సీ ఆదుకున్నాడు. 8వ వికెట్‌కు అజేయంగా 202 పరుగులు జోడించి సంచలన విజయాన్ని అందించాడు.

Story first published: Tuesday, November 7, 2023, 22:57 [IST]
Other articles published on Nov 7, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+