
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన అఫ్గానిస్థాన్ క్రికెటర్ నజీమ్ తరకై(29) ప్రాణాలు కోల్పోయాడు. గత శుక్రవారం నజీబ్ మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా రోడ్డు దాటుతున్న క్రమంలో ఓ ప్యాసింజర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్రికెటర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో నజీమ్ కోమాలోకి వెళ్లాడు. ఇక నజీమ్ మరణవార్తను అఫ్గాన్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది.
'ఓ డ్యాషింగ్ ఓపెనర్‌తో పాటు మంచి మనిషిని కోల్పోయామన్న వార్త మమ్మల్ని షాక్‌కు గురి చేసింది' అని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. ఇక అఫ్గానిస్థాన్ తరఫున ఏకైక అంతర్జాతీయ వన్డే ఆడిన నజీమ్.. 12 టీ20ల్లో 21 సగటుతో 258 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్‌తో నజీమ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో నజీబ్ 90 పరుగులతో ఓ మెరుపు ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఇక నజీమ్ అకాల మరణం పట్ల ఆ దేశ క్రికెటర్లు, అభిమానులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.