IND vs AFG: అఫ్గాన్ చేతిలో భారత్ ఓటమి!
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో టీమిండియా అనూహ్య పరాజయం ఎదురైంది. శ్రీలంకపై విజయంతో ఈ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ జట్టు.. అఫ్గాన్ చేతిలో ఓటమిపాలైంది. గురువారం దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన అఫ్గానిస్థాన్-ఏ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం.. భారత్-ఏ విజయవకాశాలను దెబ్బతీసింది.
తిలక్, ప్రభ్‌సిమ్రాన్ పోరాటం వృథా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత 49 ఓవర్లలో 9 వికెట్లకు 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్(69 బంతుల్లో 14 ఫోర్లతో 84) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా.. రుతురాజ్ గైక్వాడ్(80 బంతుల్లో 3 ఫోర్లతో 66), తిలక్ వర్మ(73 బంతుల్లో 5 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించారు.

సూర్యన్ష్ షెడ్గే(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), వైభవ్ సూర్యవంశీ(22 బంతుల్లో 9 ఫోర్లతో 44) దూకుడుగా ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో అబ్డోల్లా అహ్మద్‌జాయ్ (5/68) ఐదు వికెట్లు తీయగా.. ఫర్మానుల్లా(3/85) మూడు వికెట్లు పడగొట్టాడు. ఇమ్రాన్‌కు ఒక వికెట్ దక్కింది.
వర్షం అంతరాయంతో..
వర్షం అంతరాయంతో అఫ్గాన్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్ణయించారు. 294 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ దూకుడుగా ఆడింది. కానీ మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి అఫ్గానిస్థాన్ 25.5 ఓవర్లలో 2 వికెట్లకు 177 పరుగులు చేసింది.
వర్షం తగ్గకపోవడం.. ఆట కొనసాగే అవకాశాలు లేకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఫలితాన్ని తేల్చారు. డీఎల్‌ఎస్ పద్దతి ప్రకారం అఫ్గాన్ మూడు పరుగులు అదనంగా చేయడంతో విజేతగా ప్రకటించారు. డీఎల్‌ఎస్ లెక్కలను దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ బ్యాటర్లు వేగంగా పరుగులు రాబట్టారు.
దూకుడుగా ఆడిన అఫ్గాన్ బ్యాటర్లు..
కెప్టెన్ ఇమ్రాన్(70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75 నాటౌట్), బహిర్ షా(52 బంతుల్లో 5 ఫోర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత్-ఏ బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకూల్ రాయ్ తలో వికెట్ తీసారు. వర్షం పడకుండా మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే భారత బౌలర్లు పుంజుకొని విజయం సాధించేవారు. ఈ సిరీస్ భారత్-ఏ తమ తదుపరి మ్యాచ్‌ను సోమవారం(జూన్ 15) దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

