సంచలనం.. 6 బంతుల్లో 7 సిక్స్‌లు.. ఒకే ఓవర్‌లో 48 పరుగులు! (వీడియో)
కాబుల్: క్రికెట్‌లో సంచలనం నమోదు అయ్యింది. ఓ బౌలర్ ఒకే ఓవర్‌లో 48 పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్గానిస్థాన్ వేదికగా జరుగుతున్న కాబుల్ ప్రీమియర్ లీగ్‌లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అఫ్గానిస్థాన్ ప్లేయర్ సెదీఖుల్లా అటల్ 6 బంతుల్లో 7 సిక్స్‌లు బాది ఈ ఫీట్ సాధించాడు.
షాహిన్ హంటర్స్(SHH), అబాసిన్ డిఫెండర్స్(ABD) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఈ అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. షాహిన్ హంటర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సెదీఖుల్లా అటల్.. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఏబీడీ బౌలర్ అమిర్ జజాయ్ తొలి బంతిని నోబాల్‌గా వేయగా అటర్ సిక్సర్ బాదాడు.

దాంతో ఒత్తిడికి గురైన జజాయ్ తర్వాతి బంతిని వైడ్‌గా వేయగా.. అది బౌండరీకి వెళ్లింది. దీంతో బంతి పడకుండా అటల్ 12 పరుగులు పిండుకున్నాడు. తర్వాతి 6 బంతులను అటల్ వరుసగా 6 సిక్స్‌లు బాది వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఓకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అటల్ వరుసగా 6nb, 4wd, 6,6,6,6,6,6 సిక్స్‌లు బాది 48 పరుగులు పిండుకున్నాడు.
అతని విధ్వంసకర ఇన్నింగ్స్‌తో షాహిన్ హంటర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. అటల్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 118 పరుగులు చేశాడు. అనంతరం ఏబీడీ టీమ్ 18.3 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలి 92 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
ఇక సెదీఖుల్లా అటల్ అఫ్గానిస్థాన్ తరఫున ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది మార్చిలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అరంగేట్రం చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో 6 బంతుల్లో 60 పరుగులు చేసేలా ఉన్నారని, క్రికెట్ బ్యాటర్లకు అడ్వాంటేజ్‌మారుతుందని కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications