Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SL vs AFG: శ్రీలంక తడబాటు.. అఫ్గాన్ లక్ష్యం ఎంతంటే..?

SL vs AFG: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు విఫలమయ్యారు. ఫజలక్ ఫరూఖీ(4/34), ముజీబ్ ఉర్ రెహ్మాన్(2/38) సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(46), కుశాల్ మెండీస్(39) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్జాయ్, రషీద్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నే(15)ను ఫరూకీ ఆరంభంలోనే ఔట్ చేశాడు. దాంతో శ్రీలంక పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.

 AFG vs SL: Sri Lanka post 242-run target vs Afghanistan in World Cup 2023

కుశాల్ మెండీస్‌తో కలిసి నికలడగా బ్యాటింగ్ చేస్తున్న పాతుమ్ నిస్సంకను ఒమర్జాయ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సదీర సమర విక్రమా సాయంతో కుశాల్ మెండీస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించిన అనంతరం కుశాల్ మెండీస్‌ను ముజీబ్ పెవిలియన్ చేర్చాడు.

తన మరుసటి ఓవర్‌లోనే ముజీబ్.. సమరవిక్రమా(36) కూడా ఔట్ చేయడంతో శ్రీలంక పతనం మొదలైంది. చరిత్ అసలంక(22), ధనంజయ డిసిల్వా(14), ఏంజెలో మాథ్యూస్(23).. ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. దష్మంత చమీర(1), కాసున్ రజిత రనౌటవ్వగా.. మహీశ్ తీక్షణ(29) ఒంటరి పోరాటం చేశాడు. చివరకు ఫరూకీ బౌలింగ్‌లో అతను వెనుదిరగడంతో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Monday, October 30, 2023, 18:50 [IST]
Other articles published on Oct 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+