AFG vs SL: మహమ్మద్ నబీ కళ్లు చెదిరే క్యాచ్.. బిత్తరపోయిన మాథ్యూస్ (వీడియో)
AFG vs SL: అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో నబీ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. నబీ సూపర్ క్యాచ్‌కు ఏంజేలో మాథ్యూస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దాదాపు సిక్సర్‌గా వెళ్లిన బంతి నబీ చాకచక్యంగా అందుకొని బ్యాలెన్స్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డాడు.
ఫజలక్ ఫరూఖీ వేసిన 49వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతికి మాథ్యూస్ భారీ షాట్ ఆడగా.. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నబీ అద్భుతంగా పరుగెత్తి అందుకున్నాడు. క్యాచ్ పూర్తి చేసి బౌండరీ లైన్ తొక్కకుండా బ్యాలెన్స్ మెయింటెన్ చేశాడు. దాంతో సిక్సర్ కాస్త ఔట్‌గా మారింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(46), కుశాల్ మెండీస్(39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(4/34), ముజీబ్ ఉర్ రెహ్మాన్(2/38) శ్రీలంక పతనాన్ని శాసించగా.. అజ్మతుల్లా ఓమర్జాయ్, రషీద్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ విజయం దిశగా సాగుతోంది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్(0) విఫలమైనా.. ఇబ్రహీం జడ్రాన్(39), రెహ్మత్ షా(62) రాణించారు. క్రీజులో హష్ముతుల్లా(47 బ్యాటింగ్), ఒమర్జాయ్(39 బ్యాటింగ్) ఉన్నారు. 39 ఓవర్లు ముగిసే సరికి అఫ్గాన్ 3 వికెట్లకు 193 పరుగులు చేసింది. అఫ్గాన్ గెలవాలంటే 66 బంతుల్లో 49 పరుగులు చేయాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications