Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Temba Bavuma: మా లక్ష్యం అదే.. అలా ఆడితే వచ్చే కిక్కే వేరు!

Temba Bavuma, AFG vs SA: వన్డే ప్రపంచకప్ 2023 టైటిల్ గెలవడమే తమ ప్రధాన లక్ష్యమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. ప్రేక్షకులతో కిక్కిరిసిన మైదానంలో ఆడితే వచ్చే కిక్కే వేరని చెప్పాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ ఆడి.. అరంగేట్ర ప్రపంచకప్ అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన బవుమా.. సెమీస్, ఫైనల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా కాలి గాయం కాస్త నొప్పిగానే ఉంది. కాలికి ఏమైందో స్పష్టంగా తెలియదు. ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశం నాకు ఉంది. కానీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్ కావడంతో బరిలోకి దిగాల్సి వచ్చింది. మిడిలార్డర్‌లో కాస్త ఆడే అవకాశం దక్కింది.

AFG vs SA: Temba Bavuma says We will win World Cup 2023 trophy in front of a full capacity crowd

బౌలర్లను తరుచు మారుస్తూ వారితో సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలనుకున్నాను. గాయం తీవ్రత ఎక్కువగా ఉండి మైదానంలో ఉండటం రిస్కే అయినా.. నేను ఉండాలనుకున్నాను. గెలవడం ఓ అలవాటు. మేం ఆ మూమెంటమ్ తీసుకురావలనుకున్నాం. ఈ రోజు మేం చేజింగ్ చేశాం. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. రాసీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థి లోయరార్డర్ రాణించడంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిచ్ మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ మెరుగైంది.

సెకండ్ స్పెల్‌లో కేశవ్‌కు బంతిపై పట్టు చిక్కలేదు. గెరాల్డ్ వికెట్లు తీయడం మాకు కలిసొచ్చింది. తొలి ప్రపంచకప్ గెలవడం మా లక్ష్యం. ఇక్కడే(అహ్మదాబాద్) ప్రేక్షకులతో కిక్కిరిసిన మైదానంలో మళ్లీ ఫైనల్ ఆడాలనుకుంటున్నాం. వేలాది మంది ప్రేక్షకుల మధ్య మ్యాచ్ ఆడటం ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. ముందుగా మేం సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించాలి. రెండు రోజుల విశ్రాంతి అనంతరం సెమీస్‌కు సన్నదమవుతాం.'అని బవుమా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు కుప్పకూలింది. అజ్మతుల్లా ఓమర్జాయ్(107 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 97 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(4/44) నాలుగు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, కేశవ్ మహారాజ్ రెండేసి వికెట్లు తీసారు.

ఆండిలే పెహ్లుక్వాయో ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది. రాసీ వాన్ డెర్ డస్సెన్( 95 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. క్వింటన్ డికాక్(47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.

బంగ్లాదేశ్ బౌలర్లలో మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Friday, November 10, 2023, 22:59 [IST]
Other articles published on Nov 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+