For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AFG vs SA: అందుకే హెన్రీచ్ క్లాసెన్ ఆడటం లేదు: సౌతాఫ్రికా కెప్టెన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తమ తొలి మ్యాచ్‌కు సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్ దూరమయ్యాడు. గాయం కారణంగానే హెన్రీచ్ క్లాసెన్ ఈ మ్యాచ్ ఆడటం లేదని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా టాస్ సందర్భంగా తెలిపాడు. అతని ఎడమ మోచేతికి గాయమైందని, ముందస్తు చర్యల్లో భాగంగానే అతనికి ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతి కల్పించామని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్‌ చేస్తామని తెలిపాడు. 'పాకిస్థాన్‌లో సాధారణంగా ఉండే పిచ్‌లా కాకుండా భిన్నంగా కనిపిస్తోంది. ఎలా స్పందిస్తుందో తెలియదు. మేం కండిషన్స్‌ను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాం. భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. మా బౌలింగ్‌పై చాలా నమ్మకం పెట్టుకున్నాం. నిలకడగా రాణించడం మా బలం. ఒకే ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నాం. ఈ వికెట్‌పై మంచి లక్ష్యం ఏదో చెప్పడం కష్టం.'అని బవుమా తెలిపాడు.

AFG vs SA Temba Bavuma Reveals The Reason Why Heinrich Klaasen Not Playing Champions Trophy 2025 Clash

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తెలిపాడు. 'ఈ టోర్నీలో శుభారంభం చేయాలనేదానిపైనే ఫోకస్ పెట్టాం. షార్జాలో సౌతాఫ్రికాతో మేం నాణ్యమైన క్రికెట్ ఆడాం. మా జట్టులో క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. మాకు వారే కీలకం. మేం శుభారంభం చేస్తే సంతోషిస్తాను. ఆరంభంలోనే వికెట్లు తీసి మిడిల్ ఓవర్లలో కట్టడి చేయడం మా గేమ్ ప్లాన్.'అని తెలిపాడు.

తుది జట్లు:
ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జడ్రాన్, సెదిఖుల్లా అటల్, రెహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజలక్ ఫరూఖీ, నూర్ అహ్మద్

సౌతాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి

Story first published: Friday, February 21, 2025, 14:59 [IST]
Other articles published on Feb 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+