Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG vs SA: అఫ్గాన్ స్వల్ప లక్ష్యం.. సెమీస్ రేసు నుంచి ఔట్..!

AFG vs SA: వన్డే ప్రపంచకప్ 2023 సెమీస్ రేసు నుంచి అఫ్గానిస్థాన్ తప్పుకుంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 245 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే నమోదు చేసింది. దాంతో ఆ జట్టు రన్ రేట్ మెరుగయ్యే అవకాశం లేకుండా పోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు కుప్పకూలింది. అజ్మతుల్లా ఓమర్జాయ్(107 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 97 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

AFG vs SA: Azmatullah Omrazai’s unbeaten 97 pushes Afghanistan to 244

సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(4/44) నాలుగు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, కేశవ్ మహారాజ్ రెండేసి వికెట్లు తీసారు. ఆండిలే పెహ్లుక్వాయో ఓ వికెట్ పడగొట్టాడు. ఇప్పటికే సెమీస్ చేరిన సౌతాఫ్రికా ఈ లక్ష్యాన్ని అయినా చేధిస్తుందో లేదో చూడాలి. ఆ జట్టు ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ చేయలేకనే ఓటమిపాలైంది.

ఈ క్రమంలోనే అఫ్గాన్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా చేధిస్తుందా? లేక ఓటమి పాలవుతుందా? అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు శుభారంభం దక్కలేదు. రెహ్మానుల్లా గుర్బాజ్(25)ను కేశవ్ మహరాజ్ ఔట్ చేయగా.. ఇబ్రహీమ్ జడ్రాన్(15)ను కోయిట్జీ పెవిలియన్ చేర్చాడు. నిదానంగా ఆడిన రెహ్మాత్ షా(26)ను ఎంగిడి ఔట్ చేయగా.. హష్ముతుల్లా షాహిదిని కేశవ్ మహరాజ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో అఫ్గాన్ 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

AFG vs SA: Azmatullah Omrazai’s unbeaten 97 pushes Afghanistan to 244

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఓమర్జాయ్ ఒంటరి పోరాటం చేశాడు. మరోవైపు ఇక్రమ్ అలిఖిల్(12), మహమ్మద్ నబీ(2), రషీద్ ఖాన్(14) విఫలమైనా.. నూర్ అహ్మద్(26) సాయంతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 8వ వికెట్‌కు 44 పరుగులు జోడించిన అనంతరం నూర్ అహ్మద్‌ను కోయిట్జీ ఔట్ చేయగా.. ముజీబ్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్ నిరాశపరిచారు.

దాంతో ఓమర్జాయ్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓమార్జాయ్ ఒంటరి పోరాటంతో అఫ్గానిస్థాన్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది.

Story first published: Friday, November 10, 2023, 18:27 [IST]
Other articles published on Nov 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+