Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG vs PAK: టీమిండియాను వెంటాడుతున్న దరిద్రం.. అఫ్గాన్‌పై టాస్ గెలిచిన పాక్!

AFG vs PAK: Zadran, Janat hold fort for Afghanistan

షార్జా: ఆసియాకప్ 2022లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫైనల్ చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం కీలకం. ఇప్పటికే రెండు విజయాలతో శ్రీలంక ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోగా.. పాకిస్థాన్ ఓ విజయంతో ఫైనల్ బెర్త్ ఖారారు చేసుకునే పనిలో ఉంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ ఫైనల్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. అద్భుతం జరిగితే తప్పా భారత్ ఫైనల్ చేరలేదు. భారత్ ఫైనల్ చేరాలంటే పాక్‌పై అఫ్గాన్ గెలవాలి. కానీ టీమిండియా దరిద్రమో ఏమో కానీ పాక్ టాస్ గెలిచింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు టాస్ గెలిచి చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.

ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. పవర్ ప్లేలోనే ఓపెనర్లు ఇద్దరూ హజ్రతుల్లా జాజై(21), రెహ్మానుల్లా గుర్బాజ్(17) ఔటయ్యారు. క్రీజులో ఇబ్రహీమ్ జడ్రాన్(14 బ్యాటింగ్), కరీమ్ జనత్(9 బ్యాటింగ్) ఉన్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 64 పరుగులు చేసింది. మహమ్మద్ హస్‌నైన్, హారీస్ రౌఫ్‌ తలో వికెట్ తీశారు.

టీ20 క్రికెట్ అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఒకే ఒక ఓవర్‌లో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. అలాంటి ఫార్మాట్‌లో అఫ్గానిస్థాన్‌ జట్టు ఉత్తమ ప్రదర్శనే ఇస్తోంది. ఆసియా కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సూపర్‌-4కి చేరుకుంది. అయితే లంకపై చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో పాక్‌తో సమరానికి సిద్ధమైంది.

అఫ్గాన్‌ టీమ్‌లో జజాయ్, గుర్బాజ్‌, ఇబ్రహీం జాద్రాన్, నబీ, రషీద్‌ ఖాన్‌, నజీబుల్లా, ముజీబ్‌ వంటి టాప్‌ ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అఫ్గాన్‌తో పోలిస్తే పాక్‌ జట్టే బలంగా ఉన్నట్లు అనిపిస్తోంది. బాబర్ అజామ్‌, రిజ్వాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, నవాజ్‌, ఫకర్ జమాన్‌ వంటి బ్యాటర్లు ఆ జట్లు సొంతం. నసీమ్‌ షా, షాదాబ్‌ ఖాన్‌, నవాజ్‌ బౌలింగ్‌లో మెరుస్తున్నారు.

Story first published: Wednesday, September 7, 2022, 20:21 [IST]
Other articles published on Sep 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+