AFG vs PAK T20 WC 2021: రాణించిన నబీ, గుల్బాదీన్.. పాక్ పతనం షురూ!

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. కెప్టెన్ మహమ్మద్ నబీ(32 బంతుల్లో 5 ఫోర్లతో 35 నాటౌట్), గుల్బాదీన్ నైబ్(25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35 నాటౌట్) కీలక పరుగులు చేయడంతో అఫ్గానిస్థాన్ పాకిస్థాన్ ముందు 148 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఓ దశలో 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన అఫ్గానిస్థాన్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ నబీ, గుల్బాదిన్ సూపర్ బ్యాటింగ్‌తో 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. దాంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 రన్స్ చేసింది.
స్కాట్లాండ్‌తో దుమ్ములేపిన అఫ్గాన్ ఓపెనర్లు హజ్రతుల్లా జాజై(0), మహమ్మద్ షెహజాద్(8) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. భారీ సిక్సర్లతో ఆశలు రేకెత్తించిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రెహముల్లా గుర్బాజ్(10), అస్గర్ అఫ్గాన్(10), కరీమ్ జనత్(15), నజిబుల్లా జడ్రాన్(22) ఆ జోరును కొనసాగించలేకపోయారు. పాకిస్థాన్ బౌలర్లలో ఇమాద్ వసీమ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షాబాద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ రిజ్వాన్(8) ఆరంభంలోనే ఔటయ్యాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో పాకిస్థాన్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఓవైపు ముజీబ్.. మరోవైపు మహ్మద్ నబీ తమ స్పిన్‌తో పాక్ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టారు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి పాక్ వికెట్ నష్టానికి 38 రన్స్ మాత్రమే చేసింది. క్రీజులో ఫకార్ జమాన్‌తో పాటు, బాబర్ ఆజామ్ ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications