Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG vs PAK T20 WC 2021: చెలరేగిన అసిఫ్ అలీ.. అఫ్గాన్‌పై పాక్ ఘన విజయం!

Asif Ali blitz, Babar take Pakistan

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే తమ కంటే పటిష్టమైన భారత్, న్యూజిలాండ్ జట్లను మట్టికరిపించిన ఆ జట్టు.. శుక్రవారం అఫ్గానిస్థాన్‌పై గెలుపొంది హ్యాట్రిక్ విజయాలందుకుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ స్పిన్నర్లతో ఇబ్బంది పడిన పాక్.. అసిఫ్ అలీ (7 బంతుల్లో 4 సిక్స్‌లతో 25 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సెమీస్‌ ఆశలను మరింత సులువు చేసుకుంది.

రాణించిన నబీ, గుల్బాదీన్..

రాణించిన నబీ, గుల్బాదీన్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 రన్స్ చేసింది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ కెప్టెన్ మహమ్మద్ నబీ(32 బంతుల్లో 5 ఫోర్లతో 35 నాటౌట్), గుల్బాదీన్ నైబ్(25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో రాణించారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జోడించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఇమాద్‌ వసీమ్‌ రెండు వికెట్లు తీయగా.. షాహిన్‌ అఫ్రిది, హారిస్‌ రౌఫ్‌, హసన్‌ అలీ, షాబాద్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

బాబర్ ఆజామ్ క్లాస్ ఇన్నింగ్స్..

బాబర్ ఆజామ్ క్లాస్ ఇన్నింగ్స్..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసి 6 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ బాబర్ ఆజామ్(47 బంతుల్లో 4 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. అసిఫ్ అలీ చివర్లో మెరుపు మెరిపించాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహమ్మద్ నబీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం అఫ్గాన్ కొంపముంచింది.

 వణికించిన స్పిన్నర్లు..

వణికించిన స్పిన్నర్లు..

అంతకుముందు ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ రిజ్వాన్(8) తీవ్రంగా నిరాశపరిచాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో పాకిస్థాన్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఓవైపు ముజీబ్.. మరోవైపు మహ్మద్ నబీ తమ స్పిన్‌తో పాక్ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టారు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి పాక్ వికెట్ నష్టానికి 38 రన్స్ మాత్రమే చేసింది. ఆ తర్వాత కూడా పాక్ ఇన్నింగ్స్ నిదానంగానే సాగింది. ఇక నవీన్ ఉల్ హక్ వేసిన 9వ ఓవర్‌లో బాబర్ రెండు బౌండరీలు బాది.. వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే రషీద్ ఖాన్ రంగంలోకి దిగడంతో అతని ప్రయత్నాలు ముందుకు సాగలేదు.

ఒకే ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు..

ఒకే ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు..

ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన ఫకార్ జమాన్(25 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30) మహమ్మద్ నబీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో క్రీజులోకి వచ్చిన మహమ్మద్ హఫీజ్ వచ్చి రావడంతోనే బౌండరీతో జోరు కనబర్చాడు. అయితే రషీద్ ఖాన్ అతని దూకుడుకు కళ్లెం వేసాడు. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి 100వ టీ20 వికెట్‌‌ను ఖాతాలో వేసుకున్నాడు. క్రీజులోకి షోయబ్ మాలిక్ రాగా.. బాబర్ ఆజామ్ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రషీద్ వేసిన 17వ ఓవర్‌లో షోయబ్ మాలిక్ భారీ సిక్సర్ బాదగా.. ఆ ఓవర్ చివరి బంతికి బాబర్ ఆజామ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు. దాంతో పాక్ విజయానికి 18 బంతుల్లో‌ 26 పరుగులు అవసరం కాగా.. నవీన్ ఉల్ హక్ రెండు పరుగులు మాత్రమే ఇచ్చి కీలక వికెట్ తీసి ఆశలు రేకెత్తించాడు. కానీ కరీమ్ వేసిన తర్వాతి ఓవర్‌లో నాలుగు భారీ సిక్స్‌లు బాదిన అసిఫ్ అలీ పాక్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Saturday, October 30, 2021, 7:13 [IST]
Other articles published on Oct 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+