For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AFG vs NAM T20WC 2021: ఆఖరి మ్యాచ్‌లో చెలరేగిన అస్గర్.. నమీబియా ముందు భారీ లక్ష్యం!

Afghanistan set Namibia 161 to win

అబుదాబి: అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ (23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌‌తో 31) తన ఆఖరి మ్యాచ్‌లో అదరగొట్టాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నానని ఆదివారం ప్రకటించిన అస్గర్.. నమీబియాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లంతా అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు. సూపర్ బ్యాటింగ్ తర్వాత ఔటైన అస్గర్.. మైదానం వీడుతుండగా సహచర ఆటగాళ్లంతా బ్యాట్లను పైకెత్తారు.

అస్గర్‌కు తోడుగా ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33), అహ్మద్‌ షెజాద్‌(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), కెప్టెన్ మహమ్మద్ నబీ (17 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌‌తో 35 నాటౌట్) రాణించడంతో అఫ్గాన్ ప్రత్యర్థి ముందు 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు చేసిన అప్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్‌, లాప్టీ ఈటన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జెజె స్మిట్‌కు ఓ వికెట్‌ దక్కింది.

ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గాన్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లిద్దరూ దూకుడుగా ఆడారు. దీంతో తొలి ఆరు ఓవర్ల లోపే ఆ జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఇన్నింగ్స్ రెండో బంతినే జజాయ్ బౌండరీకి పంపిస్తే.. ఐదో బంతిని సిక్సర్ గా మలిచాడు. ట్రంపుల్మెన్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత ఫ్రైలింక్ ను కూడా వదల్లేదు. అతడు వేసిన ఐదో ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టాడు. మరోవైపు షెహజాద్ కూడా తక్కువ తినలేదు. ఐదో ఓవరర్లో అతడు.. వీస్ బౌలింగ్ లో బౌండరీ, సిక్సర్ కొట్టాడు. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ జజాయ్ ను జెజె స్మిత్ బోల్తా కొట్టించాడు. 6.4 ఓవర్లో మైఖేల్ వాన్ లింగెన్ కు క్యాచ్ ఇచ్చి అతడు వెనుదిరిగాడు. ఆ తర్వాత స్కోరుబోర్డు కాస్త నెమ్మదించింది. వన్ డౌన్ లో వచ్చిన గుర్బాజ్ (4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అఫ్ఘాన్ మాజీ కెప్టెన్ అజ్గర్ (23 బంతుల్లో 31.. 3 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ధాటిగానే ఆడాడు. అప్పటిదాకా బాగానే ఆడుతున్న షెహజాద్ ను ట్రంపుల్మెన్ ఔట్ చేశాడు. ఆ వెంటనే నజీబుల్లా (7) కూడా ఔటయ్యాడు. కానీ ఆరో నెంబర్ బ్యాటర్ గా వచ్చిన కెప్టెన్ మహ్మద్ నబీ (17 బంతుల్లో 32.. 5 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగి ఆడాడు. ఫలితంగా అఫ్ఘాన్.. నమీబియా ముందు పోరాడే లక్ష్యాన్ని నిలిపింది.

అఫ్గానిస్తాన్ జట్టుకు ఈ మ్యాచ్ చాలా కీలకం. సెమీఫైనల్ రేసులో ఉండాలంటే అఫ్గానిస్తాన్ తప్పకుండా ఈ మ్యాచ్ గెలవాలి. అయితే క్వాలిఫయర్స్‌ ద్వారా అర్హత సాధించిన నమీబియా.. సూపర్ 12 తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను (Scotland) ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అఫ్గానిస్తాన్ జట్టు ఈ మ్యాచ్‌ను తేలికగా తీసుకోకూడదు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. అఫ్గాన్‌కు పరాభవం తప్పదు.

Story first published: Sunday, October 31, 2021, 18:46 [IST]
Other articles published on Oct 31, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+