Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG vs ENG: చెలరేగిన రెహ్మానుల్లా.. ఇంగ్లండ్ ముందు పోరాడే లక్ష్యం!

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 285 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. అఫ్గాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), ఇక్రామ్ అలిఖిల్(66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది.

చివర్లో రషీద్ ఖాన్(22 బంతుల్లో 3 ఫోర్లతో 23), ముజీబ్ ఉర్ రెహ్మాన్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్(3/42) మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్(2/50) రెండు వికెట్లు పడగొట్టాడు. లియామ్ లివింగ్‌స్టోన్(1/33), జోరూట్(1/19)తలో వికెట్ తీసారు.

AFG vs ENG: Rahmanullah Gurbaz and Ikram Alikhil help Afghans post 284

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీమ్ జడ్రాన్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇబ్రహీమ్ నెమ్మదిగా ఆడినా గుర్బాజ్ బౌండరీలతో చెలరేగాడు. దాంతో అఫ్గాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ఆ వెంటనే గుర్బాజ్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

114 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ ఆదిల్ రషీద్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన రెహ్మాత్ షా(3) రషీద్ స్టంపౌట్ చేయగా.. ఆ మరుసటి బంతికే విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రెహ్మనుల్లా గుర్బాజ్‌ రనౌటయ్యాడు. అజ్మతుల్లా ఓమార్జై(19)ను లివింగ్ స్టోన్.. కెప్టెన్ హష్మతుల్లాను జోరూట్ క్లీన్ బౌల్డ్ చేయడంతో అఫ్గాన్ 174 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

ఓవైపు వికెట్లు పడుతున్నా ఇక్రమ్ అలిఖిల్ పరుగులు రాబట్టాడు. మహమ్మద్ నబీ(9) విఫలమైనా.. రషీద్ ఖాన్(23)తో కలిసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ షాట్ ఆడే క్రమంలో రషీద్ వెనుదిరిగినా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్‌తో కలిసి 8వ వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. అలిఖిలిని టోప్లీ ఔట్ చేయగా.. ముజీబ్‌ను మార్క్ వుడ్ పెవిలియన్ చేర్చాడు. చివరి ఓవర్‌లో నవీన్ ఉల్ హక్ రనౌటవ్వడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Sunday, October 15, 2023, 18:27 [IST]
Other articles published on Oct 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+