For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AFG vs AUS: సచిన్ వల్లే ఈ సెంచరీ: అఫ్గాన్ ఓపెనర్

AFG vs AUS, World Cup 2023: టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వల్లే తాను సెంచరీ చేయగలిగానని అఫ్గానిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్ తెలిపాడు. మ్యాచ్‌కు ముందు సచిన్‌తో మాట్లాడటం తమకు కలిసొచ్చిందని, ఆయన మాటలు తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయని చెప్పాడు.

వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ ఇబ్రహీమ్ జడ్రాన్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే సెంచరీ బాదిన తొలి అఫ్గాన్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాకుండా ప్రపంచకప్‌లో అతిపిన్న వయసులో సెంచరీ బాదిన తొలి లెఫ్టాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను సచిన్, కోహ్లీలను అధిగమించాడు.

AFG vs AUS, World Cup 2023: Ibrahim Zadran credits Sachin Tendulkar for his record century

21 ఏళ్ల 330 రోజుల వయసున్న జడ్రాన్.. ప్రపంచకప్‌లో సెంచరీ బాదిన నాలుగో యువ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఐర్లాండ్ పాల్ స్టెర్లింగ్, రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా), అవిష్కా ఫెర్నాండో(శ్రీలంక) జడ్రాన్ కన్నా ముందున్నారు.

ఈ రికార్డ్ సెంచరీ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన జడ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ వల్లే ఈ రికార్డు దక్కిందని చెప్పాడు. 'నిన్న సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడిన తర్వాత నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆయన తన విలువైన అనుభవాన్ని మాతో పంచుకున్నారు. ఈ మ్యాచ్‌కు ముందే నా సహచరులతో సచిన్‌లా ఆడుతానని చెప్పాను.

సచిన్ సర్ అంతలా నా శక్తిని పెంచాడు. ప్రపంచకప్ అఫ్గాన్ తరఫున తొలి శతకం బాదడం గర్వంగా ఉంది. ఈ టోర్నీ కోసం చాలా కష్టపడ్డాను. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనే సెంచరీ అందుకోవాల్సింది. కానీ తృటిలో చేజారింది. ఈ రోజు ఎట్టకేలకు సెంచరీ పూర్తి చేశాను. మా కోచింగ్ స్టాఫ్‌తో కూడా వచ్చే మూడు మ్యాచ్‌ల్లో సెంచరీలు నమోదు చేస్తానని తెలిపాను. ఈ మ్యాచ్‌లో 330 పరుగులు చేస్తామనుకున్నా.. 291 రన్స్ చేయడం కూడా సంతృప్తినిచ్చింది.'అని ఇబ్రహీమ్ జడ్రాన్ చెప్పుకొచ్చాడు.

ఇబ్రహీమ్ జడ్రాన్(143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 129 నాటౌట్) రికార్డు సెంచరీతో ఆసీస్ ముందు అఫ్గాన్ 292 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ప్యాట్ కమిన్స్‌తో కలిసి గ్లేన్ మ్యాక్స్‌వెల్ జట్టును ఆదుకున్నాడు. ఇప్పటికే సెంచరీ బాదిన మ్యాక్సీ.. విజయం దిశగా జట్టును నడిపిస్తున్నాడు.

Story first published: Tuesday, November 7, 2023, 21:42 [IST]
Other articles published on Nov 7, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+