For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AFG vs AUS: అఫ్గానిస్థాన్ కొంపముంచిన ముజీబ్ ఉర్ రెహ్మాన్! (వీడియో)

AFG vs AUS: వన్డే ప్రపంచకప్ 2023లో అఫ్గానిస్థాన్ మరో సంచలన విజయాన్ని తృటిలో చేజార్చుకుంది. మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో 21 ఫోర్లు 10 సిక్సర్లతో 201 నాటౌట్) విరోచిత డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది.

ఇబ్రహీమ్ జడ్రాన్(143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 129 నాటౌట్) రికార్డు సెంచరీతో 292 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసిన అఫ్గానిస్థాన్.. బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. కట్టుదిట్టమైన బంతులతో ఆసీస్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌కు పంపించింది. అఫ్గాన్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దాంతో అఫ్గాన్ విజయం ఖాయమని అంతా భావించారు.

Mujeeb Ur Rahaman drops Glenn Maxwell

కానీ క్రీజులోకి వచ్చిన ప్యాట్ కమిన్స్‌తో కలిసి గ్లేన్ మ్యాక్స్‌వెల్ జట్టును ఆదుకున్నాడు. కమిన్స్‌తో కలిసి మ్యాక్సీ 8వ వికెట్‌కు అజేయంగా 202 పరుగులు జోడించాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించడంతో పాటు సెమీస్‌కు చేర్చాడు.

మ్యాక్సీ విధ్వంసకర బ్యాటింగ్‌తో లయ తప్పిన అఫ్గాన్ బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు. దాంతో ఆ జట్టు పూర్తిగా ఒత్తిడికి లోనైంది. 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మ్యాక్స్‌వెల్.. 76 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 104 బంతుల్లో 150 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్.. కాళ్ల తిమ్మిర్లతో బాధపడుతూనే భారీ షాట్లతోనే విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

అయితే నూర్ అహ్మద్ వేసిన 22వ ఓవర్‌లో షార్ట్ ఫైన్ లెగ్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ముజీబ్ ఉర్ రెహ్మాన్ నేలపాలు చేశాడు. అప్పటికీ అతను 34 పరుగులు మాత్రమే చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను అఫ్గాన్ ఓటమిని శాసించాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్యాచే కాకుండా బౌలింగ్‌లోనూ ముజీబ్ తడబడ్డాడు.

ఆసీస్ విజయానికి 24 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన సమయంలో 47వ ఓవర్‌ వేసిన ముజీబ్.. వరుసగా 6, 6, 4, 6 ఇచ్చాడు. కాళ్ల తిమ్మిర్లతో బాధపడుతున్న మ్యాక్సీని భారీ షాట్ల ఆడకుండా అడ్డుకొని ఉంటే మ్యాచ్ ఉత్కంఠగా సాగేది.

Story first published: Tuesday, November 7, 2023, 23:34 [IST]
Other articles published on Nov 7, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+