Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG vs AUS: చరిత్ర సృష్టించిన అఫ్గాన్ ఓపెనర్

AFG vs AUS: అఫ్గానిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీమ్ జడ్రాన్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే సెంచరీ బాదిన తొలి అఫ్గాన్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇబ్రహీమ్ జడ్రాన్ 131 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు.

దాంతో ఇబ్రహీమ్ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ మాజీ బ్యాటర్ సమిఉల్లా షిన్వారీ 147 బంతుల్లో 96 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్‌గా ఉండగా.. తాజాగా ఇబ్రహీమ్ జడ్రాన్ సెంచరీతో అతన్ని అధిగమించాడు. ఇదే ప్రపంచకప్‌లో చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇబ్రహీమ్ జడ్రాన్ 87 పరుగులు చేశాడు.

AFG vs AUS: Ibrahim Zadran becomes first Afghanistan batter to hit World Cup hundred

21 ఏళ్ల 330 రోజుల వయసున్న జడ్రాన్.. ప్రపంచకప్‌లో సెంచరీ బాదిన నాలుగో యువ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఐర్లాండ్ పాల్ స్టెర్లింగ్, రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా), అవిష్కా ఫెర్నాండో(శ్రీలంక) జడ్రాన్ కన్నా ముందున్నారు.

ఇబ్రహీమ్‌కు ముందు మరే బ్యాటర్ కూడా అఫ్గాన్ తరఫున సెంచరీ చేయలేదు. అసలు ఈ టోర్నీలోనే అఫ్గాన్ సంచలన ఆటతీరుతో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. తాజా టోర్నీకి ముందు ఆ జట్టు గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్. అది కూడా స్కాట్‌లాండ్‌పైనే. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ కోచింగ్.. టీమిండియా దిగ్గజం అజయ్ జడేజా గైడెన్సీలో అఫ్గాన్ సంచలన విజయాలతో దూసుకుపోతుంది.

AFG vs AUS: Ibrahim Zadran becomes first Afghanistan batter to hit World Cup hundred

ఇబ్రహీమ్ జడ్రాన్(143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 129 నాటౌట్) రికార్డు సెంచరీతో ఆసీస్ ముందు అఫ్గాన్ 292 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, November 7, 2023, 18:57 [IST]
Other articles published on Nov 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+