Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG vs AUS: శతక్కొట్టిన ఇబ్రహీమ్.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం!

AFG vs AUS: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ ఇబ్రహీమ్ జడ్రాన్(143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 129 నాటౌట్) రికార్డు సెంచరీతో చెలరేగగా.. రషీద్ ఖాన్(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో శతకం సాధించిన ఇబ్రహీం జడ్రాన్ సరికొత్త చరిత్రను లిఖించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా ఇబ్రహీమ్ జడ్రాన్ రికార్డుకెక్కాడు.

AFG vs AUS: Ibrahim 129, Rashid cameo help Afghanistan post 291

ఇబ్రహీమ్‌కు ముందు మరే బ్యాటర్ కూడా అఫ్గాన్ తరఫున సెంచరీ చేయలేదు. అసలు ఈ టోర్నీలోనే అఫ్గాన్ సంచలన ఆటతీరుతో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. తాజా టోర్నీకి ముందు ఆ జట్టు గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్. అది కూడా స్కాట్‌లాండ్‌పైనే. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ కోచింగ్.. టీమిండియా దిగ్గజం అజయ్ జడేజా గైడెన్సీలో అఫ్గాన్ సంచలన విజయాలతో దూసుకుపోతుంది.

ఆస్ట్రేలియా ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచిన అఫ్గాన్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సెమీస్‌‌కు మరింత చేరువవుతోంది. ఇప్పటి నాలుగు సంచలన విజయాలతో 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీకి నేరుగా అర్హత సాధించి చరిత్ర సృష్టించిన అఫ్గాన్.. సెమీస్‌కు రెండు అడుగుల దూరంలో ఉంది. తాజా మ్యాచ్‌తో పాటు సౌతాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే సెమీస్ ఫైనల్ బెర్త్ దక్కించుకోనుంది.

AFG vs AUS: Ibrahim 129, Rashid cameo help Afghanistan post 291

ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్(21) త్వరగా ఔటైనా.. రెహ్మత్ షా(30), హష్మతుల్లా షాహిది(26), అజ్మతుల్లా ఓమార్జాయ(22), రషీద్ ఖాన్‌ల సాయంతో ఇబ్రహీమ్ జడ్రాన్ కీలక భాగస్వామ్యాలు అందించాడు. దాంతో అఫ్గాన్ ఆసీస్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది.

Story first published: Tuesday, November 7, 2023, 18:21 [IST]
Other articles published on Nov 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+