Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG vs AUS: నువ్వు మనిషివా.. మ్యాక్స్‌వెల్‌వా!

AFG vs AUS: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే చేజింగ్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ప్రపంచకప్‌లో డబుల్ సెంచరీ బాదిన మూడో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో 21 ఫోర్లు 10 సిక్సర్లతో 201 నాటౌట్) విరోచిత డబుల్ సెంచరీతో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన ఆసీస్‌కు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఊపిరి అందించాడు. కమిన్స్‌తో కలిసి మ్యాక్సీ 8వ వికెట్‌కు అజేయంగా 202 పరుగులు జోడించి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేశాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్‌తో మ్యాక్స్‌వెల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

AFG vs AUS: Fans hails Glenn Maxwell’s astonishing double ton

చేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడంతో పాటు నెంబర్5, అంతకంటే కిందిస్థాయిలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. డబుల్ సెంచరీ బాదిన తొలి నాన్ ఓపెనర్‌గా రికార్డ్ సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా.. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నాడు.

మ్యాడ్ మ్యాక్సీ అసాధారణ బ్యాటింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నువ్వు మనిషివా.. మ్యాక్స్‌వెల్‌వా? అని కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాను ఒంటి చేత్తో కాకుండా.. ఒంటి కాలుతో గెలిపించాడని ప్రశంసిస్తున్నారు. కాళ్లు తిమ్మిర్లు ఎక్కినా.. సింగిల్స్, డబుల్స్ తీసుకోకుండా భారీ షాట్లతో విజయాన్ని అందించాడు.

మ్యాక్సీ డబుల్ విధ్వంసంతో అఫ్గాన్ పోరాటం మసకబారిపోయిందని, ఆ షాట్లు చూస్తే పిచ్చెక్కుతుందని కామెంట్ చేస్తున్నారు. మ్యాక్స్‌వెల్ ఆటతీరు ప్రతీ ఒక్కరికి స్పూర్తి దాయకమని కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసి గెలుపొందింది. కమిన్స్‌తో కలిసి మ్యాక్సీ 8వ వికెట్‌కు అజేయంగా 202 పరుగులు జోడించాడు.

Story first published: Wednesday, November 8, 2023, 7:14 [IST]
Other articles published on Nov 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+