AFG Playing 11 vs NAM: ఓపెనర్లుగా జజాయ్, షాజాద్!ఫామ్‌లో రషీద్, నబీ!నమీబియాతో బరిలోకి దిగే అఫ్గాన్ జట్టిదే!

హైదరాబాద్: సూపర్ సండేలో భాగంగా ఈరోజు (అక్టోబర్ 31) డబుల్ ధమాకా ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021లో 27వ మ్యాచ్‌లో భాగంగా ఆఫ్గనిస్తాన్, నమీబియా జట్లు తలపడనున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుండగా.. టాస్ 3 గంటలకు పడనుంది.
ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు. అఫ్గాన్ తన చివరి మ్యాచులో పాకిస్తాన్‌పై ఓడినా.. గెలిచినంత పనిచేసింది. ఇక నమీబియా తమ చివరి మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌ను ఓడించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

ఇదే మొదటి మ్యాచ్
ఆఫ్గనిస్తాన్, నమీబియా జట్లు ఇంతవరకు ఒకదానితో ఒకటి అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో తలపడలేదు. టీ20 ప్రపంచకప్ 2021లో ఆదివారం నాడు ఇరు జట్లు మొదటిసారి తలపడనున్నాయి. దాంతో విజయం కోసమే ఇరు జట్లు చూడనున్నాయి. ఆఫ్గనిస్తాన్, నమీబియా జట్లలలో స్టార్ ఆటగాళ్లకు ఏ మాత్రం కొదవలేదు. దాంతో మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
అబుదాబిలో ఛేజింగ్ చేసేందుకే అన్ని జట్లు ఆసక్తి చూపిస్తాయి. ఈ టోర్నమెంట్‌లో అబుదాబి పిచ్‌పై ఆడిన 7 మ్యాచుల్లో రెండవ సారి బ్యాటింగ్ చేసిన జట్టు 6 సార్లు విజయాలు సాధించాయి. స్పిన్నర్లకు ఈ పిచ్ బాగానే కలిసొస్తుంది. ఈ రోజు కూడా స్పిన్నర్లు ప్రభావం చూపనున్నారు. ముజీబ్, రషీద్ లాంటి వారు పండగ చేసుకోవచ్చు.

ఓపెనర్లుగా జజాయ్, షాజాద్
ఆఫ్గనిస్తాన్ గత మ్యాచ్లో పాకిస్థాన్‌పై ఓడిపోయింది. ఈ మ్యాచులో ఆఫ్ఘాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది. ఓ దశలో అఫ్గాన్ 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్ అద్బుత భాగస్వామ్యం అందించారు. నబీ-నైబ్ ద్వయం 7వ వికెట్‌కు 71 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 140 పరుగుల మార్కును అందుకుంది.
అయితే ఆసిఫ్ అలీ చివరి ఓవర్లో చెలరేగడంతో ఓటమిపాలైంది. నమీబియాతో జరిగే పోరులో ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లుగా జజాయ్, షాజాద్ ఆడనున్నారు. గుర్బాజ్, ఆఫ్ఘన్, జద్రాన్, నబీలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్‌లతో కూడిన బౌలింగ్ బాగుంది.
T20 World Cup: టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంసీ!!

స్మిత్ చెలరేగేనా
నమీబియా తమ చివరి మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌ను ఓడించడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచులో బరిలోకి దిగనుంది. స్కాట్లాండ్ 109 పరుగులే చేయగా.. నమీబియా మరో 5 బంతులు మిగిలి ఉండగానే మ్యాచును ముగించింది. జేజే స్మిత్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి అతడు చెలరేగాలని నమీబియా ఆశిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచులో నమీబియా తుది జట్టులో కొన్ని మార్పులు చేసేలా కనిపిస్తోంది. క్రెయిగ్ విలియమ్స్, మైఖేల్ వాన్ లింగేన్, జేన్ గ్రీన్, గెర్హార్డ్ ఎరాస్మస్, డేవిడ్ వైస్‌లపైనే బ్యాటింగ్ భారం ఉంది. బౌలర్లు జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్ మంచి ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం.

తుది జట్లు (అంచనా)
ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్ (కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, అస్గర్ ఆఫ్ఘన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ (కెప్టెన్), గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్.
నమీబియా: క్రెయిగ్ విలియమ్స్, మైఖేల్ వాన్ లింగేన్, జేన్ గ్రీన్ (కీపర్), గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), డేవిడ్ వైస్, జేజే స్మిట్, జాన్ ఫ్రైలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications