For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup: టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంసీ!!

SA vs SL: Tabraiz Shamsi Sets New Record For Most T20I Wickets In A Calendar Year

దుబాయ్: టీ20 క్రికెట్‌ చరిత్రలో దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్ లెగ్ స్పిన్నర్‌ తబ్రెయిజ్‌ షంసీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షంసీ రికార్డు సాధించాడు. టీ20ల్లో షంసీ ఇప్పటివరకు 32 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షంసీ 3 వికెట్లు తీసి ఈ రికార్డును అందుకున్నాడు. ప్రొటీస్ లెగ్ స్పిన్నర్ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా కూడా ఉన్నాడు. షంసీ గతకొంత కాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాకు కీలక బౌలర్‌గా మారాడు.

టీ20 క్రికెట్‌ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇదివరకు ఇద్దరి పేరుపై ఉంది. ఉగాండాకు చెందిన దినేష్ నక్రానీ (2021), ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ టై (2018)లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 31 వికెట్లు పడగొట్టారు. తాజాగా ఆ ఇద్దరి రికార్డును తబ్రెయిజ్‌ షంసీ (32) బద్దలు కొట్టాడు. వనిందు హసరంగ కూడా 2021లో 31 వికెట్లు పడగొట్టాడు. ఉగాండాకు చెందిన వసీమ్‌ అబ్బాస్‌ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 2021లో అబ్బాస్‌ 29 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ లెఫ్టార్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ 2021లో 26 వికెట్లు తీశాడు.

శనివారం షార్జా క్రికెట్ మదినంలో శ్రీలంకతో జరిగిన మ్యాచులో తబ్రెయిజ్‌ షంసీ మూడు వికెట్లు తీశాడు. అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, వనిందు హసరంగా వికెట్లను అతడు పడగొట్టాడు. షంసీ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీయడంతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మొత్తంగా లెఫ్టార్మ్ లెగ్ స్పిన్నర్‌ షంసీ దక్షిణాఫ్రికా తరపున 45 టీ20ల్లో 53 వికెట్లు పడగొట్టాడు. ఇక 2 టెస్టుల్లో 6 వికెట్లు, 30 వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు. షంసీ 2017లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

సూపర్‌-12 గ్రూప్‌-1లో భాగంగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్‌ పథుమ్‌ నిశంక (72; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. సఫారీ బౌలర్లలో షంసీ, ప్రెటోరియస్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. కెప్టెన్‌ బవుమా (46) ఫర్వాలేదనిపించాడు. చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 15 పరుగులు కావాల్సి ఉండగా.. డేవిడ్ మిల్లర్‌ భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు.

Story first published: Sunday, October 31, 2021, 9:57 [IST]
Other articles published on Oct 31, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+