The Hundred: దుమ్మురేపుతున్న SRH టీమ్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ పురుషుల టోర్నీలో సన్‌రైజర్స్ గ్రూప్‌కు చెందిన నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ దుమ్మురేపుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన నార్నర్న్ సూపర్ ఛార్జర్స్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో5 వికెట్లకు 193 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీతో రాణించగా..జాక్ క్రాలీ(23 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), కెప్టెన్ హ్యారీ బ్రూక్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఫోనిక్స్ బౌలర్లలో క్రిస్ వుడ్(2/34) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.

అనంతరం బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ నిర్ణీత 10 బంతుల్లో 9 వికెట్లకు 157 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ లియామ్ లివింగ్ స్టోన్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 46), జాకోబ్ బెతెల్(31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) రాణించినా ఫలితం లేకపోయింది. నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో మాథ్యూ పోట్స్(3/26) మూడు వికెట్లు తీయగా.. జాకోబ్ డప్ఫీ, ఆదిల్ రషీద్, టామ్ లాస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆదిల్ రషీద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ మూడు విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమానిగా ఉన్న కావ్య మారన్.. తన ఫ్రాంచైజీ సామ్రాజ్యాన్ని ఇంగ్లండ్ వరకు విస్తరించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న "ది హండ్రెడ్" క్రికెట్ టోర్నీలో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ జట్టును సన్ టీవీ నెట్‌వర్క్ రూ.1,161(100.5 మిలియన్ పౌండ్లు) కోట్లకు కొనుగోలు చేసింది. సన్ నెట్‌వర్క్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు సౌతాఫ్రికా 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఉంది. ఈ మూడు జట్లను కావ్య మారన్ చూసుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications