For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యశస్వి జైస్వాల్‌ను కుక్కతో పోల్చిన ఆసీస్ మాజీ క్రికెటర్.. ఫ్యాన్స్ ఫైర్!

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జైస్వాల్‌ను కుక్కతో పోల్చాడు. ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని జైస్వాల్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ ఆటతీరును కొనియాడుతూ గిల్‌క్రిస్ట్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అసలేం జరిగిందంటే..?

ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా వెళ్లిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి లీడ్స్ వేదికగా మొదలయ్యే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్‌కు కూడా తెరలేవనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆడమ్ గిల్‌క్రిస్ట్.. యశస్వి జైస్వాల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు జైస్వాల్ కీలకంగా మారుతాడని, అతను టీమిండియా తదుపరి స్టార్ అని కొనియాడాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా మిచెల్ స్టార్క్‌తో జైస్వాకు జరిగిన మాటల యుద్దాన్ని ప్రస్తావిస్తూ 'ప్రతీ కుక్కకూ ఓ రోజు వస్తుంది'అనే సామెతను ఉపయోగించాడు. ఆ రోజు స్టార్క్‌పై జైస్వాల్ పైచేయి సాధించి అద్భుతంగా ఆడాడని, అది అతని రోజని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.

Adam Gilchrist s Every Dog Has His Day Comment on Jaiswal Sparks Controversy Ahead of England vs India 1st Test

ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది..

'యశస్వి జైస్వాల్.. టీమిండియా తదుపరి సూపర్ స్టార్. విదేశాల్లో ఎలా ఆడాలో భారత ఆటగాళ్లకు చూపించాడు. ఓవర్‌సీస్ కండిషన్స్‌లో అతను ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాలి. క్రీజులో ఎక్కువ సమయం గడపాలి. ఓపికగా బ్యాటింగ్ చేయాలి. ఇంగ్లండ్ పర్యటనలో మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా పర్యటనలో స్టార్క్-జైస్వాల్ మధ్య నెలకొన్న వివాదం క్రికెట్ పరంగా మంచిదే. ఆటలో ఇలాంటి ఘటనలు సహజం. ప్రతీ కుక్కకూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు జైస్వాల్‌ది. అందుకే ఆ రోజు స్టార్క్‌తో పాటు ఆసీస్‌పై అతను ఆధిపత్యం చెలాయించాడు. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో స్టార్క్ పుంజుకొని యశస్వి జైస్వాల్‌ను ఔట్ చేశాడు. భవిష్యత్తులో జైస్వాల్ మరింత మెరుగువుతాడు. అతని బ్యాటింగ్ మెరుపులే.. అతను ఎంత ప్రతిభావంతుడనే విషయాన్ని తెలియజేస్తాయి.'అని గిల్ క్రిస్ట్‌ చెప్పుకొచ్చాడు.

జైస్వాల్‌పై గిల్‌ క్రిస్ట్ ప్రశంసల జల్లు కురిపించినా.. 'ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది'అనే ప్రతికూల సామెతను ఉపయోగించాడు. ఎందుకంటే ఈ సామెతను సాధారణంగా ఎవరికైనా ఒక్కసారి విజయం దక్కిందని, అది ఎప్పుడూ ఉండదని సూచించడానికి ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే గిల్‌క్రిస్ట్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Thursday, June 19, 2025, 11:08 [IST]
Other articles published on Jun 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+