Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ పనైపోయింది.. ఇంటికి వెళ్లి కొడుకు డైపర్లు మార్చుకోవడమే: ఆడమ్ గిల్ క్రిస్ట్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ముగిసిందని, ఇంటికి వెళ్లి కొడుకు డైపర్లు మార్చుకోవడమే మిగిలిందని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం అతను ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అవకాశం లేదన్నాడు.

ప్రస్తుతం రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచుల్లో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్ వినిపించింది.

Adam Gilchrist Says I Don t See Rohit Sharma Going To England

త‌న చివ‌రి 14 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 155 ప‌రుగులు చేయడంతో మాజీ క్రికెటర్లు సైతం రోహిత్‌పై విమర్శలు గుప్పించారు. దేశవాళీ క్రికెట్ ఆడి ఫామ్ అందుకోవాలని సూచించాడు. తాజాగా ఆడమ్ గిల్‌క్రిస్ట్ సైతం రోహిత్ ఫామ్‌పై ఘాటుగా స్పందించాడు.
ఓ పోడ్‌కాస్ట్‌లో హ‌ర్షా బోగ్లోతే క‌లిసి పాల్గొన్న గిల్ క్రిస్ట్‌.. రోహిత్ శర్మ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ముగిసిందని అభిప్రాయపడ్డాడు.

'రోహిత్ శ‌ర్మ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తాడని నేను అకోవడం లేదు. ఇంటికి వెళ్లిన తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు అనిపించింది. ఇంటికి వెళ్లిన త‌ర్వాత రోహిత్ ముందుగా తన రెండు నెలల కొడుకుతో గడుపుతాడు.త‌న కొడుకు డైప‌ర్లు మార్చుకుంటూ ఉంటాడు. అది అతను ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు ప్రేరిపించవచ్చు. అయితే తప్పుకుండా వెళ్తానని అతను నొక్కి చెప్పినట్లు నాకు అనిపించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ ఆటను తప్పుకోవచ్చు.'అని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు.

రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ తిరిగి టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతాడనుకుంటున్నానని గిల్ క్రిస్ట్ తెలిపాడు. కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. ఆసీస్‌తో ఆఖరి టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. బుమ్రా కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. అయితే మధ్యలోనే అతను గాయంతో వెనుదిరిగడంతో కోహ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

Story first published: Friday, January 10, 2025, 22:18 [IST]
Other articles published on Jan 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+