వార్నర్ బుట్ట బొమ్మ డ్యాన్స్‌కు బన్నీ, తమన్ ఫిదా !

హైదరాబాద్: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. తెలుగు సూపర్ హిట్ 'బుట్ట బొమ్మ' సాంగ్‌కు చిందేసిన విషయం తెలిసిందే. తన సతీమణి క్యాండిస్‌తో కలిసి స్టెప్పులేసిన ఈ టిక్‌టాక్ వీడియోను తనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో వార్నర్ కూతురు ఇండి కూడా తన హిడెన్ టాలెంట్‌ను బయటపెట్టింది. తమ తల్లిదండ్రుల వెనుకాల తనకు వచ్చిన స్పెప్పులేసి అభిమానుల మనసులను గెలుచుకుంది. అందుకే క్యాండిస్ కూడా తమ కష్టాన్ని ఇండి దొంగలించిందని సరదాగా క్యాప్షన్ ఇచ్చింది.

బన్నీ సర్.. సూపర్ సాంగ్
అయితే తెలుగు సాంగ్‌కు ఆస్ట్రేలియా లెజండరీ బ్యాట్స్‌మన్ చిందేయడం తెలుగు అభిమానులకు సంతోషాన్నిస్తోంది. అభిమానులే కాదు.. ఈ సాంగ్ హీరో అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ కూడా వార్నర్ స్టెప్పులకు ఫిదా అయ్యారు. ట్విటర్ వేదికగా వార్నర్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. బన్నీ ట్వీట్‌కు వార్నర్ కూడా సూపర్ సాంగ్ అంటూ బదులిచ్చాడు.
‘థ్యాంక్యూ వెరీ మచ్.. నిజంగా అభినందిస్తున్నా'అంటూ ధన్యవాదాలు, ఓకే అనే ఏమోజీలను బన్నీ ట్వీట్ చేశాడు. దీనికి వార్నర్ కూడా ‘ధన్యవాదాలు సర్.. అద్భుతమైన పాట'అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.
సూపర్ ఫీలింగ్..
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ కూడా వార్నర్ స్టెప్పులపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ‘ప్రపంచం మొత్తం లాక్‌డౌన్ అయిన వేళ.. మనం కంపోజ్ చేసిన సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్, బిలియన్ల ప్రజలకు చేరితో ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ఫేమస్ క్రికెటర్ వార్నర్ బుట్టబొమ్మా సాంగ్‌పై స్టెప్పులేసాడు. ఆ వీడియో ఇది.' అంటూ అలవైకుంఠపురంలో హ్యాష్ ట్యాగ్‌తో తమన్ ట్వీట్ చేశాడు.
ఇక కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన డేవిడ్ వార్నర్.. ఈ క్వారంటైన్ సమయాన్ని ఫ్యామిలీతో గడుతూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నాడు. ఇటీవలే టిక్‌టాక్‌లోకి అరేంగేట్రం చేసిన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోజుకో వీడియోతో అలరిస్తున్నాడు.

అలవైకుంఠపురంలో..
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో'లోని ఈ బుట్టబొమ్మ సాంగ్ హెద్ద హిట్ అయింది. సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా.. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications