Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ X అఫ్గానిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్.. ఫ్రీగా ఎలా చూడాలంటే?

ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్ 2024 టోర్నీలో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. వరుస విజయాలతో సెమీఫైనల్ చేరిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ.. శుక్రవారం జరిగే రెండో నాకౌట్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో పాకిస్థాన్, యూఏఈ, ఓమన్ దేశాలను మట్టికరిపించిన భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

భారత కుర్రాళ్ల టీమ్‌లో కెప్టెన్ తిలక్ వర్మతో పాటు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, అన్షుల్ కంబోజ్, ఆయుష్ బదోని సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అన్షుల్ కంబోజ్ సంచలన బౌలింగ్‌తో పాకిస్థాన్‌పై విజయాన్ని అందిస్తే.. యూఏఈపై అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఓమన్‌పై ఆయుష్ బదోనీ చెలరేగాడు.

ACC Emerging Teams Asia Cup 2024 match How to watch India A vs Afghanistan A Semi Final For Free

జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ఐపీఎల్‌ ఆడిన అనుభవం.. కొంత మందికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఏ లెక్కన చూసుకున్నా అఫ్గానిస్థాన్ జట్టు భారత్‌కు ఏ మాత్రం పోటీ కాదు. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే సునాయసంగా భారత్-ఏ ఫైనల్ చేరుతోంది.

ఈ మ్యాచ్‌కు మస్కట్‌లోని ఏఐ అమెరాట్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఈ సెమీఫైనల్-2 మ్యాచ్ జరగనుంది. ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20 టోర్నీకి స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్, ఫ్యాన్ కోడ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ ఫ్లాట్‌ఫామ్స్‌లోభారత్ X అఫ్గానిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

అయితే ఫ్రీగా చూసేందుకు మాత్రం ఆస్కారం లేదు. డిస్నీ హాట్‌స్టార్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సిందే. మొబైల్ రిచార్జ్ ఆఫ్షన్స్‌లో ఓటీటీ ఫ్రీ ఆఫర్స్ ఉన్న ప్లాన్స్ రిచార్జ్ చేసుకుంటే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా వీక్షించవచ్చు.

భారత్-ఏ జట్టు:
అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(కీపర్), రమణ్‌దీప్ సింగ్, తిలక్ వర్మ(కెప్టెన్), అనుజ్ రావత్, హృతిక్ షోకీన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రాహుల్ చాహర్, ఆయుష్ బదోని, నెహాల్ వధేరా, రసిక్ దార్ సలామ్, అన్షుల్ కంబోజ్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, నిషాంత్ సింధు.

Story first published: Thursday, October 24, 2024, 21:01 [IST]
Other articles published on Oct 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+