Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Abu Dhabi T10 League: ఓర్నీ.. ఇదేం బౌలింగ్ యాక్షన్‌రా అయ్యా! (వైరల్ వీడియో)

Abu Dhabi T10 League: Twitter cannot keep calm after Kevin Koththigoda’s action puzzles Tom Banton

అబుదాబి: క్రికెట్‌లో విలక్షణమైన బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్లు ఎందరో ఉన్నారు. వీరిలో చాలా మంది తమ విభిన్నమైన శైలితో‌ సక్సెస్ అయ్యారు. శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా, భారత్ యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా, అఫ్టానిస్థాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ ఇదే జాబితాలోకి వస్తారు. అయితే వీరికి తాతాలాంటి విలక్షణమైన బౌలింగ్ యాక్షన్‌తో ఓ ఆటగాడు బౌలింగ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అలా వినూత్న శైలిలో బౌలింగ్ చేస్తూ సదరు బౌలర్ రెండు సార్లు బొక్క బోర్లా పడ్డాడు.ఈ ఘటన అబుదాబి టీ10 లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది.

కెవిన్ కొత్తిగడ..

శ్రీలంకకు చెందిన బౌలర్ కెవిన్ కొత్తిగడ టీ10 లీగ్‌లో మరాఠా అరేబియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. క్వాలండర్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ యంగ్ సెన్సేషన్ టామ్ బాంటన్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఈ శ్రీలంక లెగ్ స్పిన్నర్ బంతిని అందుకున్నాడు. అయితే అతను వేసిన తొలి బంతిని చూసి బాంటన్ బిత్తర పోయాడు. ఇదేం బౌలింగ్ యాక్షన్ రా అయ్యా! అంటూ ఫేస్ పెడుతూ ముసిముసి నవ్వుకున్నాడు.

రెండు సార్లు బోర్లా పడి..

రెండు సార్లు బోర్లా పడి..

ఇక కొత్తిగడ సాధారణ శైలికి భిన్నంగా తన శరీరాన్ని మొత్తం వంచి బౌలింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే వినూత్న శైలిలో బౌలింగ్ చేస్తూ అతనే ఒకే ఓవర్లో రెండు సార్లు బోర్లా పడిపోయాడు. దీంతో అతని కుడికాలికి గాయమైంది. అయితే ఈ ఓవర్‌లో టామ్ బాంటన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కెవిన్‌ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. వారెవ్వా ఏం బౌలింగ్ యాక్షన్ అని కొందరంటే.. ఇలాగే బౌలింగ్ చేస్తే ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేవని ఇంకొందరూ హెచ్చరిస్తున్నారు. కెవిన్ బౌలింగ్ యాక్షన్ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ పాల్ ఆడమ్స్ గుర్తు చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.

క్వాలండర్స్ విజయం..

క్వాలండర్స్ విజయం..

ఇక ఈ మ్యాచ్‌లో క్వాలండర్స్ 4 వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠ అరేబియన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లకు 101 పరగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ హఫీజ్(44), షోయబ్ మాలిక్(23) రాణించారు. అనంతరం క్వాలండర్స్ 8.1 ఓవర్లలోనే 6 వికెట్లకు 104 పరుగులు చేసి 11 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఆ జట్టులో షార్జిల్ ఖాన్(28), సోహైల్ అక్తర్(20), బెన్ డంక్(26 నాటౌట్) రాణించారు.

Story first published: Thursday, February 4, 2021, 16:15 [IST]
Other articles published on Feb 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+