న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గేల్ తుఫాను వచ్చేస్తోంది.. టీ10 లీగ్‌లో యూనివర్స్ బాస్, అఫ్రిది, బ్రావో!

Abu Dhabi T10 league: Chris Gayle, Andre Russell and Dwayne Bravo among confirmed icon players for T10

అబుదాబి: టీ20 స్పెషలిస్ట్‌‌‌‌లు... టీ10 లీగ్‌‌‌‌లో మెరవనున్నారు. వచ్చే ఏడాది జరిగే ఈ లీగ్‌‌‌‌లో యూనివర్స్​​బాస్‌‌‌‌ క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌, డ్వేన్‌‌‌‌ బ్రావో, షాహిద్‌‌‌‌ ఆఫ్రిది బరిలోకి దిగనున్నారు. టీమ్‌‌‌‌ అబుదాబి.. గేల్‌‌‌‌ను ఐకానిక్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా తీసుకుంది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఈ లీగ్ మ్యాచ్‌‌‌‌లన్నీ.. అబుదాబి షేక్‌‌‌‌ జాయెద్‌‌‌‌ స్టేడియంలోనే జరుగనున్నాయి.

టీ20 ఫార్మాట్‌‌‌‌లో వెయ్యికి పైగా సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్‌‌‌‌.. టీ10 లీగ్‌‌‌‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. 'షార్టెస్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌ మరింత ఎక్సైటింగ్‌‌‌‌గా ఉంటుంది. జాయేద్‌‌‌‌ స్టేడియంలో మరోసారి ఆడేందుకు నేను వెయిట్‌‌‌‌ చేయలేను. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామా అని వేచి చూస్తున్నా. గేల్‌‌ తుఫాను‌‌‌ వచ్చేస్తోంది' అని యూనివర్స్ బాస్ ట్వీట్ చేశాడు.

ఢిల్లీ బుల్స్‌‌‌‌ జట్టు బ్రావోను ఐకానిక్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా ఎంచుకోగా, ఆఫ్రిది.. క్వాలాండర్స్‌‌‌‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. రస్సెల్‌‌‌‌.. నార్తర్న్‌‌‌‌ వారియర్స్‌‌‌‌, నరైన్‌‌‌‌.. డెక్కన్‌‌‌‌ గ్లాడియేటర్స్‌‌‌‌ తరఫున బరిలోకి దిగనున్నారు. పాకిస్తాన్‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌ షోయబ్‌‌‌‌ మాలిక్‌‌‌‌.. మరాఠా అరేబియన్స్‌‌‌‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనున్న ఈ టీ10 లీగ్‌లో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. అబుదాబి, మారాఠా అరేబియన్స్, బంగ్లా టైగర్స్, డెక్కన్ గ్లాడియేటర్స్, కాలండర్స్, ఢిల్లీ బుల్స్, నార్తెన్ వారియర్స్, కర్ణాటక టస్కర్స్(పుణె డెవిల్స్) టీమ్స్ బరిలోకి దిగనున్నాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలంటే దానికి ఈ టీ10 లీగ్ సరిగ్గా సరిపోతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Story first published: Tuesday, December 22, 2020, 16:43 [IST]
Other articles published on Dec 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X