Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

60 నిమిషాల్లో 45 సిక్సర్లు.. అభిషేక్ శర్మ విధ్వంసం!

టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. జైపూర్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఈ వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 60 నిమిషాల వ్యవధిలో ఏకంగా 45 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు ముందస్తు హెచ్చరికలు పంపాడు.

విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అభిషేక్ శర్మ.. ఆదివారం ఉదయం జైపూర్ శివార్లలోని క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. బౌలర్లపై 'రుద్ర తాండవం' చేశాడు.

ఈ ప్రాక్టీస్ సెషన్‌లో అభిషేక్ శర్మ హిట్టింగ్‌పైనే దృష్టి సారించాడు. సుమారు గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన అభిషేక్ శర్మ.. ఒక్క బంతిని కూడా డిఫెండ్ చేయలేదు. ఆఫ్-స్పిన్, లెగ్-స్పిన్ అని తేడా లేకుండా బౌలర్లు వేసిన బంతులని స్టాండ్స్‌లోకి పంపాడు.

Abhishek Sharma Smashes 45 Sixes in 60 Minutes as World No 1 T20 Batter Unleashes Carnage in Jaipur

ఇళ్లలోకి బంతులు..

అభిషేక్ శర్మ సిక్సర్ల ధాటికి కనీసం 5 బంతులు మైదానానికి ఆనుకుని ఉన్న అపార్ట్‌మెంట్స్‌లో పడ్డాయి. ముఖ్యంగా 'ఎక్స్‌ట్రా కవర్' దిశగా అభిషేక్ ఆడిన ఇన్ సైడ్-ఔట్ షాట్లు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి.

కోచ్ సరదా వ్యాఖ్యలు..

అభిషేక్ పూర్తిగా ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్సర్లు బాదడంతో పంజాబ్ హెడ్ కోచ్ సందీప్ శర్మ పంజాబీలో సరదాగా స్పందించాడు. 'ఏంటి అభిషేక్.. ఎక్స్‌ట్రా కవర్ సిక్సర్లతోనే సెంచరీ చేస్తావా?'అని చమత్కరించగా.. అభిషేక్ తనదైన శైలిలో నవ్వుతూ మరో సిక్సర్‌తో బదులిచ్చాడు.

ప్రాక్టీస్ మొదలైన 10 నిమిషాలకే అభిషేక్ తన హిట్టింగ్ మొదలుపెట్టాడు. సహచర ఆటగాడు గౌరవ్ చౌదరిని "ఫీల్డింగ్ సెటప్ ఎలా ఉంది?" అని ఒక ఊహాత్మక ప్రశ్న అడిగి, దానికి అనుగుణంగా బంతిని స్టాండ్‌కు తరలించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ గంట సేపట్లో ఆయన కేవలం 3 లేదా 4 సార్లు మాత్రమే ఔట్ అయ్యారు. అది కూడా డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించినప్పుడే కావడం గమనార్హం.

25 ఏళ్ల అభిషేక్ శర్మ చూపించిన ఈ విధ్వంసం రాబోయే అంతర్జాతీయ మ్యాచుల్లో టీమిండియా పవర్ ప్లేలో ఏ రేంజ్‌లో చెలరేగబోతుందో చెప్పడానికి సంకేతం. న్యూజిలాండ్‌తో జరగబోయే అప్‌కమింగ్ టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ ఈ దూకుడు కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Story first published: Monday, December 29, 2025, 12:57 [IST]
Other articles published on Dec 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+