ఆసియా కప్ 2025 టోర్నీ కోసం టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సన్నదమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్‌లోనే సిక్సర్ల మోత మోగించి ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన టీమిండియా ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్‌లో అభిషేక్ శర్మ గంటపాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సెషన్‌లో అతను సిక్సర్లను ప్రాక్టీస్ చేశాడు. 25 నుంచి 30 సిక్సర్లు బాదాడు.
యూఏఈతో మ్యాచ్‌కు ముందే ఈ ప్రాక్టీస్ సెషన్ జరగడం విశేషం. అభిషేక్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా ఈ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. కానీ అభిషేక్ శర్మ తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తాను ఎదుర్కొన్న బంతులను మైదానం బయటకు పంపించాడు. బంతిని అద్భుతంగా కనెక్ట్ చేశాడు.

అతని బ్యాట్ స్వింగ్, కనెక్ట్ చేసే విధానం అతను ఫామ్‌లో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా బౌలింగ్ ప్రాక్టీస్ చేయగా.. అర్ష్‌దీప్ సింగ్ ఫిట్‌నెస్ డ్రిల్స్ చేశాడు. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ గైడెన్స్‌లో వికెట్ కీపర్ జితేష్ శర్మ కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు.
ఆసియా కప్ 2025 టోర్నీలో తొలి పోరుకు టీమిండియా సన్నదమైంది. మరికొద్ది క్షణాల్లో యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. టైటిల్ ఫేవరేట్‌గా.. టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా టీమిండియా బరిలోకి దిగుతుంది. యూఏఈపై గెలవడం టీమిండియాకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ గెలుపుపై ఎవరికీ సందేహాలు కూడా లేవు. తర్వాతి పోరులో తలపడాల్సింది చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కావడంతో ఈ మ్యాచ్‌ను భారత్ సన్నాహకంగా ఉపయోగించుకోనుంది.